సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు హీరో హీరోయిన్ మాత్రమే కాదు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ కూడా ఆ సినిమా పూజా కార్యక్రమం దగ్గర నుంచి షూటింగ్ వరకు అన్ని సవ్యంగా జరిగి అనుకున్న సమయానికి విడుదల కావాలని కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు విడుదల వాయిదా పడినప్పటికీ ఇక ఆ సినిమా విడుదల కోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఆ సినిమా విడుదల అవ్వోద్దు అని కోరుకోవడం ఎప్పుడైనా చూసారా.. ఏకంగా విడుదలను ఆపేయాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కడం ఎప్పుడైనా విన్నారా. కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది.


 కష్టపడి షూటింగ్ చేసి విడుదలకు సిద్ధం చేసిన సమయంలో తన సినిమాను విడుదల చేయొద్దు అంటూ కోర్టు మెట్లు ఎక్కి డైరెక్టర్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ సినిమా ఏదో కాదు మార్టిన్. కన్నడ హీరో ధ్రువ సర్జ హీరోగా నటించిన మార్టిన్ షూటింగ్ మొదలై దాదాపు ఆరేళ్లకు వస్తుంది. ఇన్నాళ్ల తర్వాత దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయింది. డేట్ కూడా అనౌన్స్ చేయడంతో ఇక విడుదల ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇలాంటి సమయంలో ఆ సినిమాకు మరో చిక్కు వచ్చి పడింది. ఈ సినిమా డైరెక్టర్ ఏపీ అర్జున్ స్వయంగా హైకోర్టులో సినిమా విడుదలను ఆపాలి అంటూ కేసు వేయడం అందరినీ షాక్ కి గురిచేసింది.


 మార్టిన్ చిత్ర నిర్మాత అయిన ఉదయ్ మెహతా, దర్శకుడు ఏపీ అర్జున్ మధ్య గత రెండేళ్లుగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఏకంగా సినిమా బడ్జెట్లో దుర్వినియోగం చేశారు అంటూ విఎఫ్ ఎక్స్ బృందంపై అటు నిర్మాత ఫిర్యాదు చేయగా.. ఇందులో దర్శకుడు పేరు కూడా ఉంది. దానికి తోడు ఇటీవల ప్రమోషన్స్ కార్యక్రమాలలో పోస్టర్ లో కూడా డైరెక్టర్ పేరు ఫోటో ఎక్కడ కనిపించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఏపీ అర్జున్ ఆ సినిమాకి దర్శకుడుని నేనే. నా పేరును పక్కనపెట్టి ప్రచారం మొదలుపెట్టారు. అందుకే ఈ సినిమా విడుదలను ఆపేయండి అంటూ పిటిషన్ వేశారు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: