* బన్నీకి వచ్చిన సినిమాను చేసి బోల్తా పడ్డ రవితేజ
* రవితేజ కెరీర్లో డిజాస్టర్ గా డిస్కో రాజా
* 2020లో రిలీజ్ అయ్యి... బాక్సాఫీస్  బాంబుగా మారిన డిస్కో రాజా
* ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. సినిమా అట్టర్ ఫ్లాప్
* నిర్మాత రామ్ తల్లూరికి బిగ్గెస్ట్ లాస్



టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సక్సెస్ అయిన హీరోలలో రవితేజ ఒకరు. అలాంటి రవి తేజ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో...  కష్టపడి సక్సెస్ అయిన వారిలో రవితేజ ఉంటారు. అయితే అలాంటి మాస్ మహారాజ్ రవితేజ...  దాదాపు 75 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. ఇందులో కొన్ని సినిమాలు సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.


అయితే రవితేజ కెరియర్ లో అత్యంత పెద్ద డిజాస్టర్ గా డిస్కో రాజా మిగిలింది.  2020 జనవరి మాసంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తే... పెట్టిన డబ్బులు కూడా రాలేదట. అటో ఇటో ఓటిటి ప్లాట్ఫార్మ్ ఉండటం వల్ల.. కొంత డబ్బులు రాబట్టుకున్నారట.  ఈ సినిమా ఆనంద్ దర్శకత్వంలో వచ్చింది. ఈ సినిమాలో హీరోగా రవితేజ నటించిన... పాయల్ రాజ్ పుత్ అలాగే నబా నటేష్  ఇద్దరూ హీరోయిన్గా నటించారు.


అయితే ఇందులో రవితేజను కాస్త నెగిటివ్ రోల్ లో చూపించారు. దీంతో జనాలకు ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ యాంగిల్ లో వచ్చిన ఈ సినిమాకు రామ్ తల్లూరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల బడ్జెట్ పెడితే... సగం వరకు కూడా రాలేదని సమాచారం. వాస్తవంగా ఈ సినిమాను రవితేజ తో తీయాలని అనుకోలేదట.


మొదటగా మెగా హీరో అల్లు అర్జున్ కు ఈ సినిమా కథను చెప్పారట దర్శకుడు వీఐ ఆనంద్. అల్లు శిరీష్ తో అప్పటికే ఒక్క క్షణం సినిమాను తెరకెక్కించారు ఆనంద్. అయితే ఇదే అదునుగా అల్లు అర్జున్ కు... డిస్కో రాజా కథ చెప్పారట. కానీ ఈ సినిమా కథ తనకు నచ్చలేదని... సింపుల్ గా రిజెక్ట్ చేశారట అల్లు అర్జున్.  దీంతో ఈ సినిమా రవితేజ వద్దకు రావడంతో... కొత్త దర్శకులకు చాన్సులు ఇవ్వాలని.. ఆనంద్ కు ఓకే చెప్పారట మాస్ మహారాజు రవితేజ. కానీ రిజల్ట్ విషయానికి వచ్చేసరికి అట్టర్ ప్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: