* మెగా కాంపౌండ్ లో సక్సెస్ఫుల్ హీరోగా అల్లు అర్జున్ కు గుర్తింపు
* గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ
* బన్నీ కెరీర్ లో వరుడు  అతిపెద్ద డిజాస్టర్
* 30 కోట్లు పెడితే 15 కోట్లు కూడా రాలేదు
* బన్నీ కొంప ముంచిన ఐదు రోజుల పెళ్లి
 

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్.. కు ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కొనసాగుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టారు. అప్పట్లో గంగోత్రి సినిమా బంపర్ హిట్ అందుకొని... మంచి కలెక్షన్లు రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి అండదండలతో....కెరీర్ ప్రారంభించారు బన్నీ.


అయితే గంగోత్రి సినిమా తర్వాత... దేశముదురు లాంటి బంపర్ హిట్టున్న అందుకున్న అల్లు అర్జున్... తన కెరీర్లో అత్యంత భారీ డిజాస్టర్ ను ఎదుర్కొన్నారు. అదే వరుడు సినిమా. ఐదు రోజుల పెళ్లితో... తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్  వరుడు సినిమా...  అట్టర్ ఫ్లాప్ అయిందని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. 2010 సంవత్సరంలో ఈ సినిమా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చింది.


ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ దిట్ట. కథ బాగున్న కొన్ని సన్నివేశాలు సినిమానే దొబ్బేశాయి.  దాదాపు 30 కోట్ల బడ్జెట్తో ఈ వరుడు సినిమా తీశారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత... సగం కలెక్షన్లు కూడా రాలేదట. 15 కోట్లు అటో ఇటో రాబట్ట గలిగారట. దీంతో ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా.. ఉన్న దానయ్య భారీగా నష్టపోయారట. అయితే ఇదే సినిమాను ఏక్ ఔర్ రక్షక్ పేరుతో హిందీలో డబ్బు చేస్తే...  మంచి సక్సెస్ అందుకుంది.


అంతేకాదు ఈ వరుడు దెబ్బకు కొన్ని థియేటర్లు కూడా... రెండు తెలుగు రాష్ట్రాల్లో మూతపడిపోయాడట. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్  మోయిన్ థియేటర్.. ఈ సినిమా తర్వాత మూసివేశారట.  సినిమా బాగుంటుందని.. ముందే దీన్ని కొనుగోలు చేశారట. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో యాజమాన్యం...  ఈ థియేటర్నుకు సీల్ వేసిందని ఇప్పటికీ మాట్లాడుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: