నిన్నటి రోజున న్యాయమూర్తి సెలవులో ఉండడం చేత సోమవారానికి వాయిదా వేశారు. ఒక మీడియా సంస్థతో మాట్లాడిన నాగార్జున మంత్రి కొండా సురేఖ తన కుటుంబానికి క్షమాపణలు చెప్పిన కూడా ఆమె పైన వేసిన కేసుని ఉపసంహరించుకునేది లేదంటూ వెల్లడించారు. సుమారుగా 100 కోట్ల పరువు నష్ట ధావన్ వేస్తే ప్రక్రియలో తాను ఉన్నారన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం. అలాగే ఇన్ని ఆటంకాలు ఈ ఏడాది ఎదురవుతున్నాయి ఎలా అంటూ అడగగా.. తాను ఇదే చివరిది అనుకుంటున్నాను అంటూ వెల్లడిస్తూ నాగార్జున దైవానికి వేరే ఏవో ప్రణాళికలు ఉన్నాయనిపిస్తోంది అంటూ తెలియజేశారు.
సమస్యలు ఏం లేదని తాను ఎల్లప్పుడూ కూడా బలమైన వ్యక్తిగానే భావించానని తన కుటుంబాన్ని కాపాడే విషయంలో తాను ఒక సింహం లాగా ఉంటానని అదృష్టవశాత్తు సినీ పరిశ్రమ మొత్తం కూడా తమ కుటుంబానికి అండగా నిలవడం చాలా సంతోషమని ఇది తన తండ్రి గారి ఆశీర్వాదం అంటూ నాగార్జున వెల్లడించారు.. అలాగే ఒక పోస్ట్ లో నాగార్జున ఫోటో కింద ఇలా రాసి ఉంది.. మరి అటు నాగార్జున ఈ విషయాలని తెలియజేశారా లేకపోతే ఏదైనా స్టోరీస్ లో షేర్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.. మరి ఈ విషయం అటు రాజకీయాలలో ఇటు సినీ ఇండస్ట్రీలో ఏ విధంగా ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి మరి.