- సాహో,రాధే శ్యామ్,ఆది పురుష్ డిజాస్టర్స్..
- డిజాస్టర్స్ వచ్చినా తగ్గని ప్రభాస్ మానియా..
ప్రభాస్.. ఈ పేరు చెప్తేనే చాలామందికి పూనకాలు వచ్చేస్తాయి.. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రభాస్ తో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అని దర్శకులు అనుకుంటుంటే లాభాలు కచ్చితంగా వస్తాయి అని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఈయనకు ఎన్ని డిజాస్టర్ సినిమాలు పడినా కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ -2, కల్కి -2, ది రాజా సాబ్, ఫౌజి,స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. అయితే అలాంటి ప్రభాస్ రాజమౌళి సెంటిమెంట్ కి బలై ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఇప్పుడు చూద్దాం..
హ్యాట్రిక్ డిజాస్టర్:
ప్రభాస్ కెరియర్ లోనే భారీ అంచనాల మధ్య వచ్చి వరుస సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.. అలా బాహుబలి 1,బాహుబలి 2 రెండు సినిమాలతో ఇండియన్ సినీ హిస్టరీలోనే మొదటి పాన్ ఇండియా హీరో అయినటువంటి ప్రభాస్ పై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ఎన్నో అంచనాల మధ్య సాహో అనే సినిమాని అనౌన్స్ చేశారు.ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుండే భారీ హైప్ క్రియేట్ అయ్యింది.కానీ ఫలితం మాత్రం సున్నా. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో వచ్చిన సాహో మూవీ 2019 ఆగస్టు 30న విడుదలై మొదటి రోజే 130 కోట్లు వసూలు చేసినప్పటికీ ఈ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు.350 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బడ్జెట్ కి మించి వసూళ్లు వచ్చినప్పటికీ కేవలం తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా ఎక్కడ కూడా సాహో మూవీ అలరించలేకపోయింది. దాంతో ఈ సినిమా ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు లేదని ఫ్యాన్స్ పెదవి విరిచారు. ఆ తర్వాత వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం రాధే శ్యామ్.. ఈ మూవీ కూడా భారీ అంచనాల మధ్య వచ్చింది.ఈ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్స్ అన్ని హై లెవెల్ లో తీసుకువచ్చారు. కానీ ఈ సినిమా కూడా తేడా కొట్టింది.