ప్రతి స్టార్ హీరో సినీ కెరీర్ లో హిట్లు, ఫ్లాపులు ఉంటాయి. జయాపజయాలకు ఏ హీరో అతీతం కాదు. అయితే కొన్ని సినిమాల ఫలితాలు మాత్రం అభిమానులను ఎంతో బాధపెడతాయి. అభిమానులకు సైతం సినిమా నచ్చకపోతే ఆ సినిమా ఫలితం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో అలాంటి సినిమా ఏదనే ప్రశ్నకు బ్రహ్మోత్సవం మూవీ పేరు జవాబుగా వినిపిస్తుంది.
 
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. సినిమాలో కథ, కథనం ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో పాటు సీరియల్ ను తలపించేలా సినిమాలో సీన్లు ఉండటం సినిమాకు ఎంతగానో మైనస్ అయింది. హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్లలో సైతం ఈ సినిమా వారం రోజులు కూడా ఆడలేదంటే ఈ సినిమా ఫలితం గురించి సులువుగా అర్థమవుతుంది.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఈ సినిమా ముందువరసలో ఉంటుంది. బ్రహ్మోత్సవం సినిమా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు సైతం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యాన్స్ స్టెప్పులపై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించడం గమనార్హం. మహేష్ సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాపైనా ఏ సినిమాకు ఈ సినిమా స్థాయిలో విమర్శలు అయితే రాలేదనే చెప్పాలి.
 
మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనులతో బిజీగా ఉండగా ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఫైనల్ కావాల్సి ఉంది. ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది. మహేష్ బాబు కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుండగా తర్వాత ప్రాజెక్ట్ లతో మహేష్ బాబు మార్కెట్ ఊహించని స్థాయిలో పెరగాలని అభిమానులు ఫీలవుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: