జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళకు సంబంధించి ఒక సంచలన ఆడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారుతుంది.ఇక బాధిత మహిళ ఆడియో లీక్ అవ్వడంతో ఒక్కసారిగా ఆ బాధిత మహిళ నిజ స్వరూపం బయటపడింది. ఇన్ని రోజులుగా జానీ మాస్టర్ కామ వాంచకుడు నిందితుడు అని తిడుతున్న వాళ్ళందరూ ప్రస్తుతం జానీ మాస్టర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అలాగే రీసెంట్ గా జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు అయింది. బెయిల్ మంజూరయ్యాక బయటికి రావడంతోనే ఆధారాలతో సహా అన్ని బయటపెడతాను అని జానీ మాస్టర్ భార్య జానీ మాస్టర్ అన్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళ డ్రైవర్ తో మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అవ్వడంతో ప్రస్తుతం ఈ  ఆడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ లీకైన ఆడియోలో ఏముందయ్యా అంటే.. 

జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే స్రష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించి మైనర్ గా ఉన్న సమయంలోనే అత్యాచారం చేశాడని చాలాసార్లు ఇంటికి వచ్చి లైంగిక కోరిక తీర్చుకున్నాడంటూ కేసు పెట్టింది.ఇక ఈ కేసు ఇండస్ట్రీలో ఎంత ప్రకంపనలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై కేసు పెట్టిన స్రష్టి వర్మ జానీ మాస్టర్ డ్రైవర్ తో మాట్లాడిన ఆడియో లీక్ అయింది.ఇక అందులో ఏముందంటే.. నేను మాస్టర్ ని ఎంతగానో ప్రేమించాను. కానీ నా ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయింది. మాస్టర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది.

ప్రస్తుతం నా మూడ్ ఏ మాత్రం బాగోలేదు. అందుకే పాత వీడియోలు అన్ని మళ్లీ పెడుతున్నాను. ప్రతి బర్త్డేకి నాకు మాస్టర్ ఏదో గిఫ్ట్ ఇచ్చేవారు.నా వెంటే ఉండేవారు.కానీ ఇప్పుడు ఆయన నాతో మాట్లాడటం లేదు. అంటూ స్రష్టి వర్మ ఆడియో లో చెప్పుకొచ్చింది. అయితే స్రష్టి వర్మ మాట్లాడిన మాటలకు జానీ మాస్టర్ డ్రైవర్ నీ దగ్గర మాస్టర్ ఇచ్చిన నెక్లెస్,ఉంగరం వంటివి ఉన్నాయి కదా అని అడగగా.. అవును ఉన్నాయి. కానీ అవి నేను నీకు ఇవ్వను మాస్టర్ కే ఇస్తాను. ఆయన్నే మా ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమను. కానీ నేను మాస్టర్ కి గిఫ్ట్ గా ఇచ్చిన వాచెస్ నాకు అవసరం లేదు అంటూ జానీ మాస్టర్ డ్రైవర్ తో స్రష్టి వర్మ మాట్లాడిన ఆడియో లీక్ అవ్వడంతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో స్రష్టి వర్మ అలాంటిదా..జానీ మాస్టర్ పై కావాలనే ఓ నింద వేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: