* తారకరత్న కెరియర్ కు అతి పెద్ద డిజాస్టర్ అవే
•రాజకీయాలలోకి అడుగుపెట్టి కానరాని లోకాలకు
•నందమూరి హీరోగా నిలదొక్కుకోలేకపోయినా తారకరత్న..
వారసత్వం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం అనేది ఈనాటిది కాదు. ఎన్టీఆర్ తరం నుండే చాలామంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినీ బ్యాక్ గ్రౌండ్ అనేది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి మాత్రమే సహాయపడుతుంది. ఆ తర్వాత ఆ హీరో ఎక్కువ కాలం ఉండాలా లేదా అనేది ఆ హీరో టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే చాలామంది సినీ ఇండస్ట్రీలోకి వారసత్వంగా ఎంట్రీ ఇచ్చి అందులో కొంతమంది సక్సెస్ అయితే, మరికొంతమంది సక్సెస్ కాలేక వెనుతిరిగిన వారు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఆ డిజాస్టర్లను తట్టుకోలేక స్వర్గస్తులైన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నందమూరి హీరో తారకరత్న ఒకరు
నందమూరి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన అనుకున్న కలలేవి నెరవేరలేదు. ఒకే ఏడాదిలో తొమ్మిది సినిమాలపై సంతకం చేసి, రికార్డు సృష్టించిన తారకరత్న.. ఆ చిత్రాలతో డిజాస్టర్ చవి చూసి ఇండస్ట్రీకి దూరమైపోయారు. మళ్ళీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి నంది అవార్డులు కూడా అందుకున్న ఘనత తారకరత్నది. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వరుసగా డిజాస్టర్ లు ఎదురవడంతో ఇండస్ట్రీకి దూరమై.. మానసికంగా ఎంతో క్షోభ అనుభవించి మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే అలా అడుగుపెట్టిన తొలిరోజే మృత్యువు ఆయనను వెంబడించింది. దాదాపు 23 రోజులకు పైగా చికిత్స తీసుకుంటూ మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచి కానరాని లోకాలకు తిరిగి వెళ్ళిపోయారు తారకరత్న. మరి తారకరత్న సినీ కెరియర్ కు అడ్డుకట్ట వేసిన ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకు సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న తారకరత్న, ఆ తర్వాత తారక్, భద్రాద్రి రాముడు, నో ,వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, చూడాలని చెప్పాలని, అలెగ్జాండర్, విజేత, మహా భక్తి శిరియాల, దయ, కాకతీయుడు, ఎవరు, ఖయ్యూం , రాజా మీరు కేక, ప్రాణం ఖరీదు, దేవినేని.. చివరిగా సారధి ఇలా అన్ని చిత్రాలు కూడా భారీ డిజాస్టర్ గా నిలిచాయి . దీంతో మానసికంగా కృంగిపోయిన తారకరత్న దాదాపు ఇండస్ట్రీకి దూరమై ఆ తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టి కానరాని లోకాలకు వెళ్లిపోయారు.