ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు తమ కెరియర్ లో ఏదైనా చేదు అనుభవాల గురించి సోషల్ మీడియాలో నిజాలు బయట పెట్టడం.. ఎన్నో సార్లు సంచలనంగా మారిపోయింది. ఒక్కొక్కరుగా ఈ విషయంపై ఓపెన్ అవుతూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక అయితే మరింత ప్రకంపనలు సృష్టించింది. ఇక ఎప్పుడూ మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఆమె ఎవరో కాదు నటి మల్లికా శెరావత్.
ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక హీరో తనతో అనుచితంగా ప్రవర్తించిన తీరును ఇటీవల చెప్పుకొచ్చింది ఆమె. ఒకసారి నేను ఒక పెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాను. నేను అందులో కామెడీ రోల్ పోషించా. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఓ రోజు 12 సమయంలో అర్ధరాత్రి ఓ స్టార్ హీరో నా రూమ్ లోకి రావాలని ప్రయత్నించాడు. తాను డోర్ తీయకపోవడంతో బద్దలు కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎంతగానో భయపడిపోయాను. ఇక ఆ తర్వాత అతనితో ఎప్పుడు కలిసి నటించలేదు అంటూ మల్లికా శెరావత్ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరు అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.