సాదరణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎన్నో సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాలలో కొన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కమర్షియల్ సినిమాలు ఉంటే ఇంకొన్ని కేవలం చిన్న బడ్జెట్ తో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన సినిమాలు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతోనే.. ఇక కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మూవీ తీయడం చేస్తూ ఉంటారు. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం అటు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. థియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకుడికి సినిమా నచ్చితే సూపర్ హిట్. నచ్చలేదు అంటే చివరికి డిజాస్టర్ గా మిగిలిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే సినిమాలో నటించిన నటీనటులకు తెరకెక్కించిన దర్శకుడికి డబ్బులు పెట్టిన నిర్మాతకు సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉంటుంది. అయితే ఆ నమ్మకం నిజం అవుతుందా  అన్నది మాత్రం రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది  అయితే సినిమా హిట్ అయినప్పుడు పరిస్థితి ఒకలా ఫ్లాప్ అయినప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. హిట్ అయితే ఏకంగా హీరో వల్లే హిట్ అయిందని హీరోయిన్ పాత్ర ఇందులో  ఏం లేదని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు అభిమానులు. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడు తో పాటు హీరోయిన్ కారణంగానే సినిమా ఫ్లాప్ అయింది అని అంటూ ఉండటం కూడా ఎన్నోసార్లు చూశాం.


 అయితే ఇదే విషయం గురించి హీరోయిన్ మాళవిక మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యం హీరోయిన్లకు అస్సలు ఇవ్వరు అంటూ మాళవిక మోహన్ అన్నారు. హీరోయిన్ల కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు అంటూ చెప్పుకొచ్చారు. ఓ సినిమా ఫ్లాప్ అయింది అంటే హీరోయిన్ అన్ లక్కీ అని అనేస్తూ ఉంటారు. అదే ఆ సినిమా సూపర్ హిట్ అయితే హీరోలను అందలం ఎక్కించి పొగడ్తలతో ముంచేస్తారు. భారీగా కానుకలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లకు మాత్రం ఏమి ఇవ్వరూ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మాళవిక. అయితే ఈమె ఇటీవలే బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన యుద్రా అనే సినిమాలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: