సినిమా యాక్టర్లకి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. మంచి హిట్ సినిమాలలో నటించారు అంటే చాలు ఇక సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలో క్లిక్ అయితే అటు ఆదాయం కూడా అదే రేంజ్ లో పెరిగిపోతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ని బట్టి పారితోషికం కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక హీరో హీరోయిన్ల ఆస్తులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఇలా హీరోలకు సంబంధించిన పర్సనల్ విషయాలను తెలుసుకోవడం కంటే.. ఇక వారి ఇన్కమ్, ఆస్తుల విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.


 ఇందుకు సంబంధించిన ఎన్నో విషయాలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక విషయమే ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలో ధనిక యాక్టర్స్ ఎవరు అంటే బాలీవుడ్ తారలు అయినా సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ పేర్లు ముందుగా వినిపిస్తూ ఉంటాయి. మరి ఇండియాలో సరే ప్రపంచంలో ఇలా అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్న ధనిక యాక్టర్ ఎవరు అన్న విషయం మాత్రం ఎవ్వరికి తెలియదు. అయితే ఇటీవల ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది .


 ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన మేల్ యాక్టర్స్ జాబితాలో నటుడు చిత్ర నిర్మాత అయిన టైలర్ ఫెర్రీ మొదటి స్థానంలో నిలిచాడు. ఆయన సంపద నికర విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం 11,750 కోట్ల రూపాయలు. ఇక రెండో స్థానంలో హాలీవుడ్ హాస్య నటుడు జెర్రీ సీన్ ఫెయిల్డ్ ఒక బిలియన్ డాలర్లతో ఉన్నారు. ఇక వీరి తర్వాత డ్వెన్ జాన్సన్.. అదేనండి మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్ 890 మిలియన్ డాలర్లతో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఇండియన్ నటుడు షారుఖ్ ఖాన్ 870 మిలియన్ డాలర్లు, ఇక టామ్ క్రూయిజ్ 800 మిలియన్ డాలర్ల సంపదతో ఇక ప్రపంచంలోనే అత్యంత ధనికులైన యాక్టర్స్ గా మొదటి ఐదు స్థానాలలో కొనసాగుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: