సాధారణంగా సినిమా  ఇండస్ట్రీ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చినవారు వరుస సక్సెస్ లు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఇలా సక్సెస్ సాధించాలి అనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ హీరోలు ఎంత కష్టపడి సినిమా తీసిన ఆ సినిమా రిజల్ట్ ఏంటి అని నిర్ణయించేది మాత్రం ప్రేక్షకులే. ప్రేక్షకులకు నచ్చింది అంటే సినిమాను బ్లాక్ బస్టర్ చేసి హీరోలను అందలం ఎక్కిస్తూ ఉంటారు. అదే నచ్చకపోతేఅదే సినిమాను అట్టర్ ఫ్లాప్ చేసి ఏకంగా హీరో ను చెంప దెబ్బ కొట్టినంత పని చేస్తూ ఉంటారూ అని చెప్పాలి.


 అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న వారికి ఇలా హిట్టు ఫ్లాప్ లు కామన్. కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా కెరీయర్ని సైతం ప్రభావితం చేసి వెనక్కినట్టే డిజాస్టర్ సినిమాలు హీరోల కెరియర్ లో ఉంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు వరకు చాలామంది హీరోల కెరియర్ లో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఎదిగిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరియర్ లోను ఇలాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఉంది. పెళ్లి చూపులతో తన హీరో ప్రస్తానాన్ని మొదలుపెట్టి అర్జున్ రెడ్డి తో  ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు తన వైపుకు తిప్పుకున్నాడు విజయ్ దేవరకొండ.


 గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు.  ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదుగుతున్న విజయ్ దేవరకొండ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది ఒక మూవీ.  అదే లైగర్. విజయ్ దేవరకొండ మార్కెట్ కు మించిన బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మి నిర్మాతగా వచ్చిన ఈ మూవీలో.. అటు విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం మొదటిసారి అటు విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ చేయడమే కాదు.. ఇక బాక్సర్ గా కూడా కనిపించబోతున్నాడు అని తెలియడంతో అంచనాలు పెరిగిపోయాయి  ఇక ఈ సినిమాల్లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో ఫైట్ ఉండబోతుంది ని పూరి రివిల్ చేయడంతో.. ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇలా భారీ అంచనాల మధ్య  వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టి కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంతేకాదు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన విజయ్ దేవరకొండ ను ఒక్కసారిగా ఈ డిజాస్టర్ వెనక్కి నెట్టేసింది. లైగర్ డిజాస్టర్ నుంచి విజయ్ దేవరకొండ ఇప్పటికి కోలుకోలేకపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: