పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్, కల్కి సినిమాలతో భారీ విజయాలు అందుకున్నాడు.. వరుస సక్సెస్ తో ప్రభాస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.తన తరువాత సినిమాల విషయంలో కూడా ప్రభాస్ అదే జోరును కొనసాగిస్తూ వస్తున్నారు.వరుసగా టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు ఒప్పుకుంటూ ప్రభాస్ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే తన కెరీర్లో ఇప్పటి వరకు అస్సలు టచ్ చేయని రొమాంటిక్ హారర్ జానర్‌ లో "రాజా సాబ్" సినిమా చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునేలా మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ ప్రెజెన్స్ మారుతీ ప్లాన్ చేస్తున్నాడు .ఇదిలా ఉంటే రాజా సాబ్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న  తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది.అయితే తాజాగా చిత్ర యూనిట్ నుండి వచ్చిన ఓ స్పెషల్ అప్‌డేట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.నవంబర్‌ చివరకి ఈ సినిమా షూటింగ్ పూర్తికానుందని సమాచారం. దీనితో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.అయితే ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నట్లు తెలుస్తుంది.అందులో ఒకటి స్పెషల్ సాంగ్.. ఈ సాంగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం.. ప్రభాస్ స్టైలిష్ డ్యాన్స్ చూసి చాలా రోజులైంది. ఆ లోటు ‘రాజా సాబ్’తో తీరబోతోంది. ఇందులో నిధి అగర్వాల్, రిద్దికుమార్, మాళవిక మోహనన్ ముగ్గురితో  ప్రభాస్ వేసే స్టెప్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయిని సమాచారం. అంతే కాదు ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా ఓ మాస్ టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: