సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పాట మనసియలాయో అనే పాట వెట్టయన్ చిత్రంలోనిది ఈ పాటలో ఎర్ర చీరలో కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని మరి అదిరిపోయే స్టెప్పులేసింది మంజు వారియర్.. ముఖ్యంగా ఈ అమ్మడు 46 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు దీటుగా వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉంది. ఈమె వేసిన స్టెప్పులు కూడా యువతను బాగా అట్రాక్ట్ అయ్యేలా చేశాయి. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నటిస్తున్న ఈ అమ్మడు జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. వాటి గురించి చూద్దాం.


తమిళనాడులో 1978లో జన్మించిన మంజు వారియర్ చిన్న వయసులో నుంచే కూచిపూడి శిక్షణలో మంచి ప్రావీణ్యం కలదట. మొదటిసారి మనోహరం అనే సీరియల్ ద్వారా అడుగుపెట్టిన మంజు వారియర్ చిన్న వయసులోనే  సాక్ష్యం చిత్రంలో కీలకమైన పాత్రలు నటించిందట. ఆ తర్వాత సల్లాపం అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంజు వారియర్ తన మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ అందుకుంది. అలా 1995 నుంచి 5 ఏళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలలో హీరోయిన్గా నటించింది.


మంజు వారి ఉత్తమ నటిగా కూడా కేరళ స్టేట్ ఫిలిం నుంచి అవార్డులు కూడా అందుకున్నదట. అలాగే నేషనల్ అవార్డు కూడా అందుకోవడమే కాదు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నది మంజువారియర్. అలాంటి సమయంలోనే హీరో దిలీప్ ను ప్రేమించి మరి 1995లో వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప కూడా ఉన్నది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన మంజువారియర్.. కొన్ని కారణాల చేత తన భర్త నుంచి విడిపోయింది. అలా 2014లో మంజు వారియర్ విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత తన కూతురు తన వద్ద ఉంచడానికి కోర్టు కూడా అంగీకరించలేదు.. దీంతో మంజు వారియర్ ఈ విషయం తీవ్రమైన బాధను మిగిల్చిందట .ఆ బాధతో ఈమె చాలా ఏళ్లు సినీ ఇండస్ట్రీకి రాలేదట. మళ్లీ 15 ఏళ్ల తర్వాత హౌ ఓల్డ్ ఆర్ యు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది మంజు వారియర్. ఆ తర్వాత తునివు, లూసిఫర్, అసురన్ తదితర చిత్రాలలో నటించి భారీ క్రేజ్ అందుకుంది. అందుకే ఈమె జీవితం పడి లేచిన కెరటంలా మళ్లీ పుంజుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: