ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపెట్టడంతో సినిమాపై ఆశించిన స్థాయిలో హైప్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయింది. ఇక ట్రైలర్లో రజనీకాంత్ మూవీస్ లోని వావ్ మూమెంట్స్ లేవు. అలాగే అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా లేదు. జైలర్ బ్లాక్‌బాస్టర్ విజయాన్ని ‘వేట్టయన్’ కనుమరుగు చేస్తుందా లేక లాల్ సలాం లాగా డిజాస్టర్ అవుతుందని చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. సినిమాపై మిక్స్డ్ ఫీడ్ బ్యాక్ ఉన్నప్పటికీ రజినీకాంత్ కెరియర్ లో ఇది మరో మరో బిగ్‌స్ట్ హిట్ అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని దర్శకుడు జ్ఞానువేల్ తెరకెక్కించగ.. ఇందులో రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం ఖాయమని మేకర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఈ సినిమాకు ఆయన సంగీతం అందిస్తుండగా, ఈ చిత్ర ఔట్‌పుట్‌ని చూసి ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని తన సోషల్ మీడియాలో తనదైన మార్క్ రివ్యూ ఇచ్చాడు. అనిరుధ్ గతంలోనూ పలు సినిమాలకు రివ్యూ ఇవ్వగా, అవి విజయాన్ని అందుకున్నాయి. ఇక వేట్టయన్ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.