బుల్లితెర పై ఎందరో నటులు అడుగు పెట్టి స్టార్ నటులుగా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో కూడా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు . అలాంటి వారిలో నటుడు ప్రభాకర్ కూడా ఒకరు . ఎన్నో సీరియల్స్ లో అద్భుతమైన పాత్రలో నటించి బుల్లితెర మెగాస్టార్ గా సూపర్ క్రేజ్‌ తెచ్చుకున్నారు . ఇలా బుల్లితెర పై నటిస్తూ నే వెండి తేర‌పై ఆపరేషన్ దుర్యోధన , మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ లో నటించారు ప్రభాకర్ . ఇప్పుడు ఆయన వారసుడుగా ఆయన కొడుకు చంద్రహాస్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన నటించిన మొదటి సినిమా రామ్ నగర్ బన్నీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.


ఈ సినిమా రిలీజ్ కి ముందే సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయ్యాడూ చంద్రహాస్. యాటిట్యూడ్ స్టార్ గా సూప‌ర్ క్రేజ్‌ తెచ్చుకున్నాడు . అలాగే ఆయన చేసిన డాన్స్ వీడియోలు కూడా బాగా వైరల్ అయ్యాయి . అయితే ఇప్పుడు ప్రభాకర్ కు కూతురు కూడా ఉంది . ఆమె పేరు దివిజా ప్రభాకర్. చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ నిర్మాతల్లో  దివిజా ప్రభాకర్ కూడా ఒకరు . అందుకే తన తమ్ముడు మూవీ ప్రమోషన్లను దగ్గరుండి చూసుకుందామే . ఈ క్రమంలో నేదివిజాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ప్రభాకర్ కూతురు దివిజ కూడా పలు సినిమా ల్లో యాక్ట్ చేసింది. ఇప్పుడు త‌మ్ముడు కోసం నిర్మాతగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే దివిజ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. సోదరుడు చంద్రహాస్ ప్రమోషన్లలో దివిజా ప్రభాకర్ని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతుంటారు. దివిజ కూడా హీరోయిన్ మెటీరియల్ అని, త్వరలోనే సినిమాల్లోకి రావాలంటూ కామెంట్లు పెడెతున్న‌రు. కాగా గతంలో పలు సందర్భాల్లో తండ్రిలానే తనకు కూడా నటనంటే ఇష్టమని చెప్పుకొచ్చింది దివిజ. మరి సోదరుడు చంద్రహాస్ లాగే ఆమె కూడా త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: