మంచి హైట్. హైట్‌కు తగ్గ అందం., చూడ చక్కని నవ్వు , చాలా అందమైన లుక్స్ ఉన్న ఆ భామ మరెవరో కాదు ఆయేషా టకియా. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్‌తో పోటీ పడబోతున్నాడనే నమ్మకం ఆమెను చూసినప్పుడు ఎవరికైనా కలుగుతుంది. కానీ ఇది జరగలేదు. 2004లో మొదలైన ఆమె కెరీర్ 2009 నాటికి పడిపోయింది. 'టార్జాన్ గర్ల్' అయేషా టకియా ఎంత త్వరగా ఫామ్ లోకి వచ్చిందో అంతే త్వరగా కనుమరుగైపోయింది. ఆయేషా 2009లో బాయ్‌ఫ్రెండ్ ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది .ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారి తన పేరును కూడా మార్చుకుంది. 'టార్జాన్: ది వండర్ కార్', 'వాంటెడ్', 'పాఠశాల' 'మోడ్', 'యే దిల్ మాంగే మోర్', 'క్యాష్', 'షాదీ సే పెహ్లే', 'షాదీ నంబర్ వన్' 'సండే' వంటి సినిమాలో అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంది.
తెలుగులో కూడా నాగార్జునతో కలిసి సూపర్ సినిమాలో నటించింది. 37 ఏళ్ల అయేషా టకియా సినిమాల్లో యాక్టివ్‌గా ఉండకపోవచ్చు, కానీ ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితం కారణంగా ఆమె చాలా సార్లు వార్తల్లో నిలుస్తు వచ్చింది. బాలీవుడ్‌లో సర్జరీ చేసుకున్న నటీమణుల ఈమె కూడా ఒకరు. కానీ ఎక్కువ కాలం ఆమె ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. దీంతో పాటు తన ఉనికిని కాపాడుకునేందుకు తన జీవితంలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకుని అందరికి షాక్ ఇచ్చింది. అవును! అయేషా టకియా తన ఫ్లాప్ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని, తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకుంది , సమాజ్‌వాదీ పార్టీ (SP) నాయకుడు , ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీకి కోడలు అయ్యిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
2009లో అయేషా పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక సినిమాల్లో నటించడం మానేసింది. అయేషా భర్త ఫర్హాన్ వ్యాపారవేత్త . అలాగే ఆయేషా మామగారు అబూ అసిమ్ అజ్మీ గురించి మాట్లాడినట్లయితే, అతను మహారాష్ట్రలోని అత్యంత ధనిక ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నడు. మన్‌ఖుర్డ్ శివాజీనగర్ అసెంబ్లీ స్థానంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీడియా కథనాల ప్రకరం ఆయన ఆస్తుల విలువ రూ.142 కోట్లు. కాగా, ఆయన కుమారుడు ఫర్హాన్ నికర విలువ రూ.72 కోట్లకు పైగా ఉంది. ఇలా సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన యేషా పెళ్లి చేసుకుని కోట్ల ఆస్తికి వారసరాలిగా మారింది.