పైన టైటిల్ చూసి అందరూ షాక్ అవుతున్నారా.. నిజం నేను కూడా వీళ్ళ రిలేషన్ గురించి తెలిసినప్పుడు ఇదే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే మనం అనుకునే రిలేషన్ అయితే కాదు. వీరిద్దరి మధ్య పేరుకు సంబంధించిన రిలేషన్ ఉంది. అది ఎలా అంటారా?  అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో స్టార్ న‌టులో సైఫ్ అలీఖాన్ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోగా వరుస విజయాలతో దూసుకుపోయిన సైఫ్ మధ్యలో హీరోగా అవకాశాలు తగ్గడంతో విలన్ గా కూడా నటిస్తున్నాడు. ఇదే క్రమంలో తానాజీలో తన విలనిజంకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అలానే ప్రభాస్ ఆది పురుష్‌ మూవీలో రావణాసురుడిగా, ఎన్టీఆర్ దేవరలో బైరాగ తన  వీల‌నిజంతో తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యాడు సైఫ్ అలీ ఖాన్.


ఇక సైఫ్ ఫాలీ ఖాన్ తల్లి షషర్మిలా ఠాకూర్ .. ఈమె కూడ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఆ రోజుల్లో షర్మిల ఠాగూర్ ను స్క్రీన్ పై చూడగానే ప్రేక్షకులు చొక్కాలు చింపుకొనే వాళ్ళు..  ఒక స్టార్ హీరోకు ఉన్న క్రేజ్ అప్పట్లో సైప్‌ తల్లికి ఉండేది. అప్పటి సెలబ్రిటీలు కూడా షర్మిల ఠాకూర్ కు అభిమానులుగా ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి షర్మిల ఠాకూర్ అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఎంతో ప్రత్యేకమైన అభిమానం.. మరి ఎంతలా అంటే ఆమెపై ఉన్న అభిమానంతో ఏకంగా తన కూతురికి ఆమె పేరుని పెట్టుకునే అంత.. అలా షర్మిలకు తండ్రి వైయస్.. షర్మిల ఠాకూర్ పై ఉన్న అభిమానంతో తన కూతురికి షర్మిల రెడ్డి అనే పేరు పెట్టాడు.


 ఇదే విషయాన్ని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. ఇక సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన తండ్రి ఒకప్పటి ఇండియన్ కేప్టెన్ మన్సూర్ అలీ ఖాన్. అంతేకాదు వీళ్లది రాజవంశీయుల కుటుంబం. సైఫ్ అలీ ఖాన్‌కు ఇద్దరు చెల్లెళ్లు. అందులో ఒకరు సబా అలీ ఖాన్, మరోకరి ప్రముఖ నటి సోహా అలీ ఖాన్. వీరంతా నవాబు కుటుంబానికి చెందిన వారసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: