అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా రూ.100 కొట్లకు పైగా కలెక్షన్లు సాధించి డైరెక్టర్ సుకుమార్ కు అల్లుఅర్జున్ కు నార్త్‌లో భారీ స్టార్‌డ‌మ్ తీసుకొచ్చింది. ఇప్పుడు పుష్ప 2 పై కూడా సౌత్ కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు విడుదల తేదీ వాయిదా పడింది. అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ సినిమాను డిసింబ‌ర్‌  6న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.


అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎవరూ ఊహించిన క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాల్లో ముందుగా దర్శకుడు అల్లు అర్జున్ హీరోగా కాకుండా బాలీవుడ్ స్టార్లను దృష్టిలో పెట్టుకుని ఈ కథను ప్రిపేర్ చేసి వాళ్లకు స్టోరీ చెప్పారట. వాళ్లు నో చెప్పడంతో పుష్ప బన్నీ దగ్గరికి వచ్చింది. ఇంతకీ ఈ సినిమాను చేతులారా వదులుకుంది  ఎవరు.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అయితే గతంలో సుకుమార్ పుష్ప కథ‌ను ముందుగా షారుక్ చెప్పాడట.


అయితే ఆయనకు స్టోరీ నచ్చిన క్యారెక్టర్ తనకి సెట్ అవ్వదు.. సౌత్ స్టార్లతో చేయండి అని సలహా ఇచ్చారట. అలా షారుక్ ఇచ్చిన సలహాతో సుకుమార్ బన్నీకి పుష్ప స్టోరీ చెప్పి ఆయనతో సినిమా చేసి బంపర్ హిట్ ఇచ్చాడు. ఇదే విషయాన్ని ఇటీవల అబుదబిలో జరిగిన ఐఫా అవార్డ్స్ లో షారుక్ ఖాన్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అలా షారుక్ ఖాన్ ఈ విషయం చెప్పడంతో పుష్పకి మొదటి ఛాయిస్ అయినా అంటూ అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: