క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం పుష్ప-2. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక నటిస్తోంది. అలాగే ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. పుష్ప సినిమాకు మించి సీక్వెల్లి అద్భుతంగా తెరకెక్కించాలని ప్లాన్ తోనే చిత్ర బృందం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల ఎన్నోసార్లు వాయిదా వేస్తూనే ఉన్నది. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు గడిచిన కొన్ని నెలల క్రితమే చిత్ర బృందం ప్రకటించారు.



పుష్ప-2 సినిమా సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. పుష్ప-2 సినిమా షూటింగ్ ఆగిపోయిందని గత కొద్ది రోజులుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పుష్ప-2 సినిమా ట్రైలర్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే నవంబర్ రెండవ వారంలో ట్రైలర్ ని రిలీజ్ చేసే విధంగా సుకుమార్, అల్లు అర్జున్ ప్లాన్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.


ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగితే నవంబర్ 15న ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అలాగే పుష్ప-2 సినిమా రిలీజ్ కి మూడు వారాల ముందు నుంచి ప్రమోషన్స్ సైతం మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటూ వెళ్తుందట చిత్ర బృందం. ఈ విషయం విన్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ గా అయితే ఈ న్యూస్ బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందట. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు రూ .350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రష్యా, జపనీస్ వంటి దేశాలు కూడా విడుదల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: