టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదన్న సంగతి తెలిసిందే.  శ్రీ అనే సినిమాతో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


సౌత్ లోనే కాకుండా నార్త్ లోను ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకొని తనకంటూ స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది. తెలుగుతోపాటు కన్నడం, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంటుంది. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తమన్నా సినీ ఇండస్ట్రీలోకి కథానాయికగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 19 సంవత్సరాల పూర్తి చేసుకుంది.    

ఇదిలా ఉండగా..... తమన్నాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమన్నాపాకిస్తాన్ క్రికెటర్ ను ప్రేమించిందని, అతనితోనే ఆమెకు బ్రేకప్ అయిందని అప్పట్లో జోరుగా ప్రచారాలు జరిగాయి. పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా డేటింగ్ చేసిందని చాలానే రూమర్స్ తెరమీదకు వచ్చాయి. గతంలో వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు సైతం విపరీతంగా వైరల్ అయ్యాయి.


దీంతో అబ్దుల్ రజాక్ తో తమన్నా రిలేషన్ లో ఉందని, అతనితో డేటింగ్ చేస్తుందని జోరుగా ప్రచారాలు జరిగాయి. అయితే తర్వాత దీనిపై తమన్నా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేమిద్దరం ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సమయంలో కలుసుకున్నామని, అతడిని కలవడం అదే మొదటిసారి అని, మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. దాంతో ఆ పుకార్లకు చెక్ పడింది. కాగా తమన్నా భాటియా ప్రస్తుతం విజయ్‌ వర్మతో ప్రేమలో ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: