ఏంటి నాగచైతన్య కాబోయే భార్యతో కాకుండా మరో స్టార్ హీరోయిన్ తో ఒకే ఇంట్లో ఉన్నాడా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అది సినిమా షూటింగ్ కోసమా..లేక నిజంగానే ఉంటున్నాడా అని ఈ విషయం తెలిసిన చాలా మంది అసలు విషయం ఏంటో అని జుట్టు పీక్కుంటున్నారు. మరి ఇంతకీ నాగచైతన్యహీరోయిన్ తో కలిసి ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. సెలబ్రిటీలు పెళ్ళికి ముందు డేట్ చేయడం అనేది కామన్. అయితే నాగచైతన్య కూడా పెళ్లికి ముందే శోభితతో రిలేషన్ లో ఉన్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అలాంటిది కాబోయే భార్య శోభిత తో కాకుండా మరో హీరోయిన్ తో ఒకే ఇంట్లో కనిపించారు నాగచైతన్య.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు  నేషనల్ క్రష్ రష్మికా మందన్నా..అవును మీరు వినేది నిజమే.. రష్మిక మందన్నా, నాగచైతన్య ఇద్దరు ఒక ఇంట్లో కనిపించారు. 


అయితే వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండటం ఏంటి.. వీళ్లిద్దరి కాంబోలో సినిమా కూడా రావడం లేదు.. అలాంటిది వీరిద్దరూ ఎందుకు ఓకే ఇంట్లో ఉన్నారు అని అందరికీ అనుమానాలు రాక తప్పదు.అయితే వీరిద్దరూ ఒకే ఇంట్లో కనిపించడానికి ప్రధాన కారణం కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండి కల్యాణ రామన్ తాజాగా తన ఇంట్లో నవరాత్రి వేడుకలను ఘనంగా జరిపారు.అయితే ఈ నవరాత్రి వేడుక కోసం ఎంతో మంది సెలబ్రిటీలను తమ ఇంటికి ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఈ వేడుకకి సినీ ఇండస్ట్రీలోని చాలామంది తరలివచ్చారు.

 అలా సౌత్,నార్త్ రెండు ఇండస్ట్రీలకు సంబంధించిన సెలబ్రిటీలు త్రిసూర్ లోని కళ్యాణ్ జ్యువెలర్స్ ఎండి కళ్యాణ రామన్ ఇంట్లో సందడి చేశారు.బాలీవుడ్ నటినటులు అయినటువంటి శిల్పా శెట్టి,సైఫ్ అలీ ఖాన్, బాబి డియోల్, మలైకా అరోరా, అజయ్ దేవగన్ లు నార్త్ ఇండస్ట్రీ నుండి ఈ వేడుకల్లో పాల్గొనగా సౌత్ ఇండస్ట్రీ నుండి రష్మిక మందన్నా అలాగే నాగచైతన్య లు నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా కన్నడలో ఫేమస్ నటుడు అయినటువంటి టోవినో థామస్ సతీసమేతంగా ఈ నవరాత్రి వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: