నిజాయితీగా ఆట ఆడితే బిగ్ బాస్ హౌస్ లో ఉంచరు. కాంట్రవర్సీలు ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లో మనుగడ సాగించవచ్చు అని ఆదిత్య ఓం ఎలిమినేషన్ ద్వారా మరోసారి అందరికీ అర్థమయింది ఆదిత్య ఓం సినిమాల్లో చాలా హుషారుగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి హౌస్ లోకి అడుగుపెట్టాడు అంటే అందరిని గడగడలాడించేస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ అంచనాలకు అతను భిన్నంగా అతను ఉన్నాడు. అతనికి 50 ఏళ్లు అన్న విషయం హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అందరికి తెలిసిందే. అయినప్పటికీ కుర్ర కంటెస్టెంట్స్ తో పోటీ పడి తన వంతు ఎంత చేయాలో అంతా చేశాడు.
ఒకరితో గొడవ పెట్టుకోవడం నోరు జారి మాట్లాడటం. ఇక ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం ఆదిత్య ఓం ఒక్కసారి కూడా బిగ్ బాస్ హౌస్ లో చేయలేదు. బహుశా ఇదే కావచ్చు అతని ఎలిమినేషన్ కి కారణం. అందరిలాగానే కాంట్రవర్సీ కామెంట్స్ చేసి ఉంటే ఆదిత్య కూడా హౌస్ లో ఉండేవాడేమో. ఎలిమినేషన్ లో భాగంగా గురువారం ఆదిత్య హౌస్ నుంచి బయటికి వచ్చేసాడు. కనీసం ఏవి వీడియో కూడా వేయకుండా ఆదిత్య ను ఎలిమినేట్ చేశారు.
ఈ క్రమంలోనే ఇతను గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏవి వీడియో వెయ్యలేదు అంటే బహుశా ఆదిత్య ను సీక్రెట్ రూమ్ కి పంపించి ఉంటారు అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆడియన్స్ కచ్చితంగా ఆదిత్య ఓం మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారని.. ఊహించని ట్విస్టులు ఇస్తున్న బిగ్ బాస్ ఇక ఇప్పుడు ఆదిత్య ని మళ్ళీ తీసుకువచ్చి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఏం జరగబోతుంది అన్న విషయం ఇక నేడు శనివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ద్వారా అందరికీ క్లారిటీ రాబోతుంది.