నాగేశ్వరరావు తర్వాత ఆయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున అదే రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. 60 ఏళ్ల వయసులో కూడా ఇంకా టాలీవుడ్ మన్మధుడు గానే కొనసాగుతున్నారు ఆయన. అయితే నాగార్జున కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్లు ఉన్నాయి. కానీ ఒక్క సినిమా మాత్రం నాగార్జున వదిలేయడంతో బాలయ్య చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్టు కొట్టేసాడట. ఆ మూవీ ఏదో కాదు ఆదిత్య 369. రచయిత సంగీతం శ్రీనివాసరావు మొదట ఈ కథను నాగార్జునకి,నాగేశ్వరరావుకి వినిపించారట.
అయితే ఈ కథ ఇద్దరికీ నచ్చేసింది. నాగార్జున కూడా సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. కానీ అప్పటికే ఇతర ప్రాజెక్టులో నాగార్జున బిజీగా ఉన్నాడట. ఇక కొన్నాళ్లు వెయిట్ చేయమని సంగీతం శ్రీనివాసరావుని అడిగాడట. కానీ అంత వెయిట్ చేసే ఓపిక లేకపోవడంతో.. ఇక సంగీతం శ్రీనివాసరావు బాలయ్య బాబుకు ఈ కథ వినిపించాడట. అయితే ఇక బాలయ్యకు కూడా సినిమా కథ బాగా నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నాడట. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో మొదటి ఫ్యూచరిస్టిక్ సినిమా గా మారిపోయింది. ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది అని చెప్పాలి. బాలయ్య కెరియర్ లోనే ఇది క్లాసికల్ ఎవర్గ్రీన్ మూవీగా నిలిచిపోయింది అని చెప్పాలి.