350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి రోజే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అనుకున్న రేంజ్ లో హిట్ అవుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు కూడా నెలకొన్నాయి. కానీ యావరేజ్ టాక్ తోనే వసూళ్ల సునామీ సృష్టిస్తుంది దేవర మూవీ. ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూలు సాధించి సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కూడా అదరగొడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల చిత్ర బృందం సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. ఇక ఈ సక్సెస్ మీట్ కి అభిమానులు హాజరు కాలేదు. కానీ ఇక సినిమాలోని నటీనటులు అందరూ కూడా వచ్చేశారు అని చెప్పాలి. అయితే దేవర పార్ట్-2 గురించి ఇటు ఎన్టీఆర్ ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.
మొదటి పార్ట్ తో పోల్చి చూస్తే దేవరా 2 మరింత భారీగా బెటర్గా రూపొందుతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. ఇప్పటికే రెండు అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించాము అంటూ చెప్పుకొచ్చాడు. స్టోరీ ఆల్రెడీ పూర్తయింది. పార్ట్ వన్ హిట్ కావడంతో ఇక రెండో పార్ట్ ను మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నాం. మొదటి పార్ట్ తో పోల్చి చూస్తే రెండో పార్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కొరటాల శివ నెల రోజులపాటు ఫ్యామిలీతో ట్రిప్ కు వెళ్తారు. ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ పనులు మొదలు పెడతాం అంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.