మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలో ఫేమస్ అయినటువంటి మంచు మనోజ్ ని మహేష్ బాబు బావ సుధీర్ బాబు నిజంగానే ఘోర మోసం చేశాడా..ఇంతకీ సుధీర్ బాబు చేసిన ఆ మోసం ఏంటి.. ఎందుకు మంచు మనోజ్ బుక్ అయ్యాడు అనేది ఇప్పుడు చూద్దాం.. మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. గత కొద్ది సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన భూమా మౌనికతో రెండో పెళ్లి తర్వాత మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. ఈ మధ్యనే బొమ్మ మౌనిక పండంటి ఆడబిడ్డ కి జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల సంగతి అటుంచితే తాజాగా మంచు మనోజ్ ని సుదీర్ బాబు ఘోరంగా మోసం చేశారు.మరి ఇంతకీ సుధీర్ బాబు చేసిన మోసం ఏంటయ్యా అంటే..ప్రస్తుతం సుధీర్ బాబు మా నాన్న హీరో అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. 

ఈ సినిమాకు సంబంధించిన టీజర్ చూస్తే సినిమా ఎలా ఉంటుందో అందరికీ అర్థం అవుతుంది. తండ్రి కొడుకులు మధ్య జరిగిన ఎమోషన్ బాండింగ్ గురించి ఈ మూవీలో చెప్పబోతున్నారు.అయితే ఈ సినిమాకి ప్రమోషన్స్ మొదలు పెట్టేసిన సుధీర్ బాబు మంచు మనోజ్ కి తెలియకుండానే ఆయనతో ప్రమోషన్ చేయించుకున్నారు. అదెలా అంటే తాజాగా మీడియా కంటపడ్డ మంచు మనోజ్ ని మీడియా వాళ్ళు ఫోటోలకు ఫోజులు ఇవ్వమని అడగగా అసలు విషయం తెలియని మంచు మనోజ్  ఫొటోస్ దిగారు.అయితే ఆ ఫొటోస్ వెనకాల బ్యాక్ గ్రౌండ్ ఏముంది అని గమనించకుండా ఫొటోస్ దిగారు.


కానీ ఆయనని ఫోటోలు తీస్తున్న సమయం లోనే సుధీర్ బాబుకు సంబంధించిన మా నాన్న హీరో అనే బ్యానర్ ని పెట్టి మనోజ్ వెనక్కి తిరిగే లోపే దాన్ని రివర్స్ చేసేశారు .ఇక ఈ విషయాన్ని సుధీర్ బాబు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ సారీ బ్రదర్ నాకు ఇంకో ఆప్షన్ కనిపించలేదు అందుకే ఇలా చేశాను అని మంచు మనోజ్ ని ట్యాగ్  చేస్తూ అసలు విషయం చెప్పారు.ఇక తన మనసులో మోసపోయాను అనుకున్న మంచు మనోజ్ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. బ్రహ్మానందం కి సంబంధించిన ఒక ఫన్నీ మీమ్ ని పోస్ట్ చేసి ఫన్నీగా స్పందించడంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అలా సుధీర్ చేసిన పనికి మనోజ్ బకరా అయ్యారు అని ఈ వీడియో చూసిన నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: