మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు .. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆరు దశాబ్దాలనూంచి చిత్ర పరిశ్రమకు తిరుగులేని గాడ్ ఫాదర్గా కొనసాగుతున్నాడు. 1980 నుంచి ఇప్పటి వరకు ఆయన 150 పైగా లో  సినిమాల్లో నటించి తిరుగులేని రారాజుగా వెలుగుతున్నాడు. ఇక ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇప్పటికి ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలు అడుగు పెడుతున్నారు. కాగా చిరు ఖాత‌లో ఎన్న‌లో రికార్డులు ఉన్న‌యి. వ‌టిలో ఓ అరుదైన రికార్డు అనే సోంతం చేసుకున్న‌డు. ఆ రికార్డును భవిష్యత్తులో మరి ఏ హీరో బ్రేక్ చేయడం చాలా కష్టం  ఇంతకు చిరంజీవి ఖాతాలో ఉన్న ఆ రికార్డు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


ముగ్గురు అక్కచెల్లెళ్లతో కలిసి నటించిన ఏకైక హీరో చిరంజీవినే .. ఆ అక్కా అక్కాచెల్లెళ్లు మ‌రి ఎవరో కాదు.. నగ్మా, జ్యోతిక, రోషిని..ఇక చిరు ముందుగా నగ్మాతో ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో కలిసి నటించాడు. అలాగే జ్యోతిక తో ఠాగూర్ సినిమాలో ఆడిపాటగా... రోషి నీతో మాస్టర్ సినిమాలో రొమాన్స్ చేశాడు. మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోల విషయానికొస్తే బాలయ్య నగ్మాతో అశ్వమేధం . రోషినితో  పవిత్ర ప్రేమలో కలిసి నటించాడు... కానీ జ్యోతికతో ఒక్క సినిమాలో కూడాా నటించలేదు.


అలాగే నాగార్జున కూడా నాగ్మాతో మాతో వారసుడు, అల్లరి అల్లుడు, కిల్లర్ సినిమాల్ల్లో నటించాడు. అలాగే జ్యోతిక తో మాస్ సినిమాలో నటించాడు. కానీ రోషిని తో మాత్రం నటించలేదు. ఇక వెంకటేష్ కూడా నగ్మాతో కొండపల్లి రాజా, సరదా బుల్లోడు, సూపర్ పోలీస్ సినిమాల్లో నటించగా జ్యోతిక, రోషిని లతో ఒక సినిమాలో కూడా నటించలేదు. అయితే ఈ అక్కా చెల్లెలిలో జ్యోతిక మాత్రమే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది మిగిలిన ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఇలా చిరంజీవి మాత్రమే వీళ్ళ ముగ్గురితో కలిసి నటించి అరుదిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: