తాజాగా సమంత, కొండా సురేఖ, అక్కినేని ఫ్యామిలీ వివాదంలో ఇండస్ట్రీ అంతా నాగార్జున కుటుంబం వైపు నిలుస్తోంది. హీరోలు, హీరోయిన్లు అందరూ ప్రతి ఒక్కరు నాగార్జున కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు. కొండ సురేఖ కూడా ఈ విషయంలో జరిగిన పొరపాటు గుర్తించి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఇక నాగార్జున కూడా కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ తన మాటలు వెనుక తీసుకోవడంతో ఈ విషయాన్ని ఆపేయాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా పిలుపునిచ్చారు. అయిన టాలీవుడ్ లో కొందరు అతిగా స్పందిస్తూ వస్తున్నారు.


తప్పు జరిగింది.. దానిని మంత్రి కొండా సురేఖ వెనక్కు తీసుకున్న తర్వాత కూడా సినీ ప్రముఖులు అతిగా స్పందించడం.. కాంగ్రెస్ పెద్దలని ఆగ్రహానికి గురిచేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో కుక్కిన పెనులా పడి ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తమకంటే రోషగాళ్ళు ఎవరూ లేనట్టుగా వ్యవహరించుటపై కాంగ్రెస్ పెద్దల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుందని తెలుస్తోంది. వివాదం ముగించాలని పిలుపు ఇచ్చిన తర్వాత కూడా టాలీవుడ్‌కు చెందిన కొందరు పెద్దలు చేసిన అతి చేష్టలు.. మితిమీరిన ప్రవర్తన రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.


ఇప్పటికే టాలీవుడ్ విషయంలో రేవంత్ రెడ్డి గురుగా ఉన్నారు. గద్దర్ అవార్డుల విషయంలో ఎవరు కలిసి రావడం లేదు. కానీ టికెట్ రేట్ల పెంపు, ఇతర విషయాల కోసం మాత్రం ముఖ్యమంత్రి దగ్గరికి పరుగులు పెడుతున్నారు. ప‌ర్మిష‌న్లు తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేయాలంటే ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో 10 ఏళ్లపాటు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి గట్టిగా వంత పాడారు. కెసిఆర్, కేటీఆర్ కుటుంబానికి భజనలు, కీర్తనలు చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరుపై చాలా ఆగ్రహంతో ఉన్నారని.. ఇకపై టాలీవుడ్ విషయంలో అంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని.. కఠినమైన మార్గాన్నే ప్రభుత్వం ఎంచుకుంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: