టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు తన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో నిన్నే పెళ్లాడతా మూవీ ఒకటి. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి టబు హీరోయిన్గా నటించగా ... క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 1996.వ సంవత్సరం అక్టోబర్ 4 వ తేదీన థియేటర్లో విడుదల అయింది.

ఇక ఈ మూవీ కి థియేటర్లో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి తాజాగా 28 సంవత్సరాలు పూర్తి అయింది. మరి ఈ సినిమా విడుదల అయ్యి 28 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీ కి ఆ సమయంలో వచ్చిన కలెక్షన్స్ , అలాగే ఈ మూవీ నమోదు చేసిన రికార్డ్స్ వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ 39 సెంటర్లలో 100 రోజులు , 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడి అద్భుతమైన రికార్డును సృష్టించింది.

ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.76 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.60 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.21 కోట్లు , ఈస్ట్ లో 83 లక్షలు , వెస్ట్ లు 57 లక్షలు , గుంటూరు లో 91 లక్షలు , కృష్ణ లో 76 లక్షలు , నెల్లూరు లో 54 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.26 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కగా , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని ఈ సినిమాకు 74 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: