మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “దేవర”.. మాస్ దర్శకుడు కొరటాల తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అద్భుతంగా నటించింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఎన్టీఆర్ అభిమానులు 'దేవర' మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద వున్నారు. ..ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆశ్చర్యకరంగా దేవర బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుపిస్తోంది.  రాజమౌళి తెరకెక్కించిన సినిమా తరువాత సాధారణంగా ఆ హీరోకు తరువాత సక్సెస్ రాదు అని ఓ బ్యాడ్ సెంటిమెంట్ వుంది.ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత  ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.. అయితే అదే సమయంలో రాజమౌళి మూవీ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా అనే భయం కూడా ఎన్టీఆర్  కి  ఎక్కడో చోట  ఉంది.అయితే అలాంటి అపోహలన్నీ ఈ సినిమా సక్సెస్ చెరిపేసింది..

దేవర ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. కానీ ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం సపోర్ట్ కరువైంది.. చిన్న హీరోలు నుంచి స్టార్ హీరోలు సైతం  ఎవరూ కూడ ఈ సినిమా గురించి మాట్లాడింది లేదు. ఇదే అందరికి ఆశ్చర్యం కలిగించింది. ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే సినిమా చూడకపోయినా అందరూ బెస్టాఫ్ లక్ అంటూ చెప్తూంటారు. అలాంటిది ఈ సినిమాకి అది జరగలేదు. ఎందుకిలా అనేది ఇప్పుడు కొందరికి క్వచ్చిన్ మార్క్ గా మారింది..ఎన్టీఆర్ అందరీతో స్నేహంగా ఉంటారు. అయినా దేవర గురించి చిన్న ట్వీట్ కూడా ఎందుకు రాలేదు అంటే మొదటి రోజు సినిమా చూసాక ,మిక్సెడ్ టాక్ వచ్చింది.కొందరికి సినిమా రిజల్ట్ పై సందేహం వచ్చి ఉండవచ్చు.దీనితో తాము ట్వీట్ చేసి మెచ్చుకుంటే సినిమా ప్లాఫ్ అయితే ఏంటి పరిస్దితి అనేది ఓ రీజన్ గా చెప్తున్నారు. అయితే దేవర సక్సెస్ అయినా కూడా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో పలు ప్రశ్నలకు తావిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: