ఇక మన తెలుగు చత్ర పరిశ్రమ లో బ్రహ్మానందం తర్వాత హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక అభిమానులను తెచ్చుకున్నారు . ప్రధానంగా తాగుబోతు పాత్రల కు ఆయన బ్రాండ్ అనే చెప్పవచ్చు . ఆ పాత్రల్లో మంచి నటనను చూపించి అందరినీ న‌వ్వించే వారు . ఎంఎస్ నారాయణ దూకుడు , దుబాయ్ శీను సినిమాల్లో ఆయన చేసిన పాత్రలో ఇప్పటి కీ ప్రేక్ష‌కుల ను ఎంతో నవ్విస్తున్నాయి.


ఇక ఇదే క్రమంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ మధ్య ఎంతో గొప్ప స్నేహం ఉంది . వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కూడా నటించారు. అలాంటి ఎమ్మెస్ నారాయణ చనిపోయే చివరి రోజుల్లో ఊహించని సంఘటన జరిగిందట .. దాని గురించి బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . ఇక ఎప్పుడైతే అనారోగ్యం కారణంగా ఎమ్మెస్ నారాయణ హాస్పిటల్ లో చేరారో .. చివరి దశలో ఉన్నారని మరియు ఆయన చ‌నిపోతారని తెలిసినప్పుడు మరో గంటలో మరో ఆయన చనిపోతాను అనగా తన కుమార్తె ను పిలిచి ఒక పేపర్ అడిగారట .


ఆ పేపర్ మీద బ్రహ్మానందం అన్నయ్యని చూడాలని ఉంది .. అని ఎమ్మెస్ నారాయణ రాశారట . దాంతో ఆమె బ్రహ్మానందం కి ఫోన్ చేసి విషయం చెప్ప గా బ్రహ్మానందం వెంటనే ఆస్పత్రికి వెళ్లారట . అప్పుడు ఎమ్మెస్ నారాయణ చేయి పట్టుకుని ఆయన కు ఏదో చెప్పడానికి ప్రయత్నించారట  కొంత మాత్రమే అర్థమవుతుంది చేయి గట్టిగా పట్టుకుని అన్నయ్య అని పిలిచాడు ఆ బాధను చూస్తూ ఉండలేక బయటికి వచ్చేసానని .. ఆ తర్వాత 15 నిమిషాలు మాత్రమే ప్రాణం ఉంది అంటూ బ్రహ్మానందం ఎంతో బాధపడ్డాను అంటూ ఆ ఇంటర్వ్యూ  లో చెప్పుకొచ్చారు . అలా తన చేతి లోనే ఎమ్మెస్ నారాయణ చనిపోయాడని బ్రహ్మానందం ఇప్పటికీ బాధపడుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: