అయితే ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో ఎంత క్రేజ్ తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాలు సైతం ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం 80, 90వ దశకంలో ముంబై అండర్ వరల్డ్ మాఫియా చేతిలో ఉండేది. ఆ మాఫియాకు సంబంధించిన వ్యక్తిలతో మందాకినీకి సంబంధాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ మాఫియా దావూద్ ఇబ్రహీంతో సైతం మందాకిని చట్టపట్టలేసుకొని తిరిగిందని అప్పట్లో వార్తలు వచ్చేవి. అంతే కాకుండా వీరికి పెళ్లి సైతం జరిగిందని పలు పత్రికలు కూడా వార్తలు రాసుకు వచ్చాయి.
అయితే మందాకిని మాత్రం ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అని తనకు దావూద్ ఇబ్రహీంతో ఎలాంటి సంబంధంం లేదని ఆ వార్తలను కొట్టి పడేసింది. అయినా కూడా దుబాయిలో దావుద్‌తో కలిసి ఉన్న ఆమె ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలు ఇలా ఉంచితే ప్రస్తుతం మందాకిని ఎక్కడ ఉంది ఏం చేస్తుంది.. అనే సందేహం రావచ్చు అయితే ప్రస్తుతం ఆరుపదుల వయసు వయసు దాటిన మందాకిని తన కెరీర్ మధ్యలో వదిలేసి డిబేట్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా శిష్యుడు అయిన ఓ డాక్టర్ను పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు పిల్లలు ప్రస్తుతం మందాకిని యోగా టీచర్ గా, దలైలామా శిష్యురాలుగా కొనసాగుతున్నారు.
చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంది. అయితే దావూద్ ఇబ్రహీం తో ఆమెకు ఉన్న సంబంధం కారణంగా చాలా సంవత్సరాలు ఆమె పేరు చీకటి ప్రపంచంతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తెలుగు నాట అప్పటి పత్రికల్లో మందాకిని గురించి ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించిన హీరోయిన్ గా పేర్కొని ఆమెకు దావూద్ ఇబ్రహీంతో వివాహం జరిగిందంటూ కొన్ని గాసిప్స్ వచ్చాయి. ఇలా సూపర్ స్టార్ కృష్ణతో దావూద్ ఇబ్రహీం కు లింక్ చేస్తూ కొన్ని విచిత్రమైన కథనాలు అప్పట్లో వడ్డించారు.