పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గ్లోబల్ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప2 లో నటిస్తున్నాడు.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్‌గా మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఇక డిసెంబర్ 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంద. ఇదే క్రమంలో సాధారణంగా అందరూ అల్లు అర్జున్ చేసిన మొదటి చిత్రం గంగోత్రి అనుకుంటారు. అయితే గంగోత్రి కంటే ముందే అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా ఆగిపోయిందట. రీసెంట్ గానే ఈ విషయాలను అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .. ఆ ఇంటర్వ్యూలో బన్నీ మాట్లాడుతూ యానిమేటర్ గా స్థిరపడతామని కెనడాకు వెళుతున్న స‌మ‌యంలో ఒక సినిమాలో నటిస్తే జీవితాంతం ఎంతో మెమొరబుల్ గా ఉంటుంది కదా అనిపించింది . తెలిసిన స్నేహితుల ద్వారా అవకాశం కూడా వచ్చింది.


కేవలం మూడు నెలల్లోని ఆ సినిమాను కంప్లీట్ చేసే కెనడా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాకముందే ఆగిపోయింది . అలా నా మొదటి సినిమా ఆగిపోవటం నాకు ఎంతో బాధ కలిగించింది.  అప్పటి నుంచి సినిమాల మీద శ్రద్ధ పెట్టాను .. నాకు ఉన్న న‌ట వారసత్వం ను వదిలిపెట్టి యానిమేటెర్‌ గా ఎందుకు వెళ్లాలి అనుకున్నాను. అయితే అది సరైన నిర్ణయం కాదని కూడా అనిపించింది .. ముందు ఓ సినిమాలో నటించడం సక్సెస్ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం అనుకున్నాను. ఇదే విషయాన్ని నాన్న కూడా చెప్పాను ఆ తర్వాత ముంబైల కిషోర్ నమిత్ కుమార్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్ష పొందాను కోర్సు పూర్తవుగానే గంగోలో అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: