అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ గా పుష్ప2 డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ తో పాటు అందరిని ఆకట్టుకుంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అవ్వగా అవి యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ  నుంచి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.


ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు సుకుమార్, రష్మిక క్యారెక్టర్ కు షాక్ ఇచ్చే విధంగా మరో బాలీవుడ్ స్టార్ బ్యూటీని పుష్ప2లు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె క్యారెక్టర్ రష్మిక శ్రీవల్లి క్యారెక్టర్ కంటే మాస్‌గా బోల్డ్ లుక్ లో ఉంటుందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ వన్ లో సమంత ఐట‌మ్‌ సాంగ్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఎప్పుడు పుష్ప2లో ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియటం లేదు.


అయితే ఇప్పుడు సుకుమార్ దీనికి కూడా అదిరిపోయే ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. సమంత సాంగుకు మించి ఇప్పుడు వచ్చే పార్ట్ 2 లో పాట డబల్ రేంజ్ లో ఉంటుందని. అలాగే అందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిందు వైబోతుందని అంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఎవరు రివిల్ చేయటం లేదు. అలాగే ఆమెతో పాటు ఈ పాటలో రష్మిక కూడా కనిపిస్తుందట. సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్లు మరో రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఆ పాటలన్నిటికీ మించి పుష్ప 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఇక మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: