అభిమాని హత్య కేసులో గత కొన్ని నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్నాడు కన్నడ స్టార్ హీరో దర్శన్.. రేణుక స్వామినీ కొట్టి చంపారని ఆరోపణలతో ఒక్కసారిగా కన్నడ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ముఖ్యంగా నటి పవిత్ర గౌడ విషయంలో రేణుక స్వామిని హత్య చేయించారని విధంగా ఫ్రూప్స్ కూడా ఉండడంతో.. దర్శన్ A2, పవిత్ర గౌడ A1 పోలీసులు తెలియజేశారు. అయితే జల్సా జీవితానికి అలవాటుపడ్డ హీరో దర్శన్ మాత్రం జైలులో ఉండలేకపోతున్నారని ఇప్పటికి ఎన్నో అభియోగాలు వినిపించాయి. అంతేకాకుండా తను పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నట్లుగా తెలిపారు.



బెంగళూరులో పరస్పర అగ్రహారం జైలు నుంచి బళ్లారి జైలుకి సైతం దర్శనాన్ని తీసుకువెళ్లారు అధికారులు. అయితే అక్కడ కూడా దర్శ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లుగా ఇటీవలే తెలియజేశారు. అలాగే రేణుక స్వామి ఆత్మ తనను వెంటాడుతోందంటూ జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో రేణుక స్వామి ఆత్మ తన కలలోకి వచ్చి చాలా భయపెడుతున్నారంటూ వెల్లడించారట. దీంతో తాను ఒంటరిగా ఉండలేకపోతున్నారని బెంగళూరు జైలుకు పంపించాలని అక్కడ అధికారులను సైతం దర్శన్ వేడుకుంటున్నారట.



దీంతో దర్శన్ అర్ధరాత్రి నిద్రలో లేచి చాలా గట్టిగా కేకలు కడుతుండడంతో తోటి ఖైదీలు కూడా ఇబ్బంది పడుతున్నారట అయితే ఈ విషయం గురించి జైలు అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటన తెలియజేయలేదు.. మరొకవైపు దర్శన్ వెన్ను నొప్పి సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారని.. దీంతో తను కూర్చోలేక నిలబడలేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు. బెంగళూరుకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటానంటూ పట్టుబడుతున్నారట దర్శన్.. అలాగే ఆస్పత్రిలో స్కానింగ్ చేసేందుకు కూడా పలు రకాల సలహాలు చేస్తూ ఉన్న మరొకవైపు దర్శన తరపున లాయర్ కూడా బెయిల్  కోసం పోరాడుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: