ఈ జనరేషన్ లో సింగిల్ టేక్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కు పేరుంది. సింగిల్ టేక్ లో డైలాగ్స్ చెప్పడంలో అయినా డ్యాన్స్ చేయడంలో అయినా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్ కు ఎవరూ సాటిరారు. భారీ డైలాగ్స్ ను సైతం అలవోకగా చెప్పగల ప్రతిభ తారక్ సొంతమని చెప్పవచ్చు. తారక్ నటించిన చాలా సినిమాలలో డైలాగ్స్ ను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరనే సంగతి తెలిసిందే.
దేవర సినిమాలో సైతం తారక్ చెప్పిన కొన్ని డైలాగ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. కెరీర్ తొలినాళ్లలోనే మాస్ సినిమాలతో మెప్పించిన తారక్ తర్వాత రోజుల్లో కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 9 భాషల్లో అనర్ఘళంగా మాట్లాడగలరు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎక్కడికి వెళ్లినా అక్కడి భాషలో మాట్లాడటం ఎన్టీఆర్ కే సాధ్యమని చెప్పవచ్చు.
అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభకు తగ్గ మరిన్ని పాత్రలు దక్కాలని తారక్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా తారక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లు ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల ప్రేక్షకులను సైతం తన ప్రతిభతో మెప్పిస్తున్నారు.