"కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా" అనే డైలాగ్ దాదాపుగా పాతికేళ్ల క్రితం డైలాగ్ అయినా ఈ జనరేషన్ ప్రేక్షకులు సైతం ఈ డైలాగ్ ను ఎంతో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన భగవంత్ కేసరి మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవగా ఈ సినిమా తమిళంలో రీమేక్ అవుతుందని తెలుస్తోంది. బాలయ్య బాబీ మూవీకి సైతం వీరమాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
అతి త్వరలో బాలయ్య బాబీ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కావడంతో పాటు టైటిల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య ఏ సినిమాలో నటించినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ సినిమా మెప్పించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమాలలో బాలయ్య నటిస్తుండటం గమనార్హం.
బాలయ్య పారితోషికం పరంగా కూడా టాప్ లో ఉన్నారు. ఒక్కో సినిమాకు బాలయ్య 34 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లు బాలయ్యతో సినిమా చేయడానికి ఎంతగానో ఆసక్తి ఛూపిస్తున్నాయి. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న బాలయ్య తర్వాత సినిమాలతో హిందీ ఆడియన్స్ ను సైతం మెప్పిస్తారేమో చూడాల్సి ఉంది. డైరెక్టర్ల ఎంపిక విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న బాలయ్య మరిన్ని సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.