- సినీ బ్యాగ్రౌండ్ ఉన్న సొంత టాలెంట్ మిన్న అని నమ్మాడు.!

- సినిమాలకు పనికిరాడు అనే స్థాయి నుంచి దర్శకులు క్యూ కట్టే స్థాయికి?

- నటనే కాదు నాట్యంలో కూడా అల్లు అర్జున్ కు సాటి లేరు.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ అంటే ఎలాంటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ  అల్లు అర్జున్ మాత్రం తన సొంత టాలెంట్ ను నమ్ముకుని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒక్కోసారి ఎంత టాలెంట్ ఉన్నా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ మన సొంత నటన టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం కష్టం. అలా సొంత టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీలో ఎదిగినటువంటి గొప్ప హీరో అల్లు అర్జున్. కేవలం తన ఇంటి పేరు అల్లు అని తప్ప, తను మిగతాదంతా తన సొంతంగా సంపాదించుకున్నదని చెప్పవచ్చు. ఒకప్పుడు నటన రంగానికి పనికిరాడు, మొహం చూడు ఎలా ఉంది అని అవమానించిన వాళ్ళ ముందే  అబ్బో అల్లు అర్జున్, ఆయనతో తట్టుకోలేం బాబు ఆయన నటన హైలెట్, డాన్స్ చూస్తే నాట్యమయురే డ్యాన్స్ చేసినట్టు అనిపిస్తుంది అనే స్థాయికి ఎదిగారు. అలాంటి అల్లు అర్జున్ గంగోత్రి నుంచి మొదలు పుష్ప వరకు అనేక హిట్స్ అందుకొని దూసుకుపోతున్నారు.

బన్నీ డాన్స్ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు :
అల్లు అర్జున్ క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు. మొత్తం 20 ఏళ్ల కెరియర్ లో 22 సినిమాలు, 19 విజయాలు, 14 మంది డైరెక్టర్లతో సినిమాలు చేశారు అల్లు అర్జున్. గంగోత్రిలో సింహాద్రి పాత్రలో అమాయకంగా కనిపించినటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాలో రాటు తేలిన స్మగ్లర్ గా  కనిపించిన నటుడికి ఎంతో తేడా ఉంటుంది. నటుడిగా తనకు తాను మెరుగుపరుచుకునేందుకు   వచ్చిన ఏ చిన్న అవకాశానికి కూడా అల్లు అర్జున్ వదులుకోడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2003లో వచ్చిన గంగోత్రి  సినిమాలో ఆయన నటనకు చాలా  విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆర్య చిత్రంతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూ ముందుకు సాగారు. కేవలం సినిమాలే కాకుండా తనదైన డాన్స్ తో  ఇండస్ట్రీలో డ్యాన్సులో తనకు సాటి లేరు అనిపించుకున్నారు.  అలాంటి ఆయన పుష్పా సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో తనకు తిరుగు లేదనిపించుకున్నాడు. పుష్పాలో తన యాక్టింగ్ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు.  ఈ విధంగా ప్రతి సినిమాలో తనదైన శైలిలో నటిస్తూ ముందుకు సాగుతున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన పుష్ప2 చిత్రం చేస్తున్నారు ఈ సినిమా కోసం ఆయన అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: