ఇటీవల బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడంతో నందమూరి వారసుల ఎంట్రీ కచ్చితంగా ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. మోక్షజ్ఞ  సింభ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా నందమూరి కుటుంబం నుంచి మరొక వారసుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్ కుమారుడు సూర్యా రామ్. ఇటీవలె కళ్యాణ్ రామ్ నిర్మించిన సినిమాలన్నీ కూడా భారీగానే దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను పలు రకాల ఈవెంట్స్ కి పార్టీలలో కనిపించేలా చేస్తూ ఉంటారు కళ్యాణ్ రామ్.


కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి కొడుకు సూర్యరామ్ అవ్వగా కూతురు తారక అద్వైత. గడచిన కొన్ని ఏళ్ళ క్రితం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఇప్పుడు తాజాగా వెకేషన్ కి వెళ్ళినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తన భార్య పిల్లలతో కలిసి కళ్యాణ్ రా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వెళుతూ ఉండగా అక్కడ మీడియా ఒక వీడియోని తీయడం జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ కొడుకు కూతుర్ని చూసి పలువురు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.


ఎప్పుడో చిన్న వయసులో చూసిన వీరిద్దరిని ఇప్పుడు ఇలా చూసి అప్పుడే ఇంత పెద్ద వాళ్ళు అయిపోయారా అనెంతగా మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కుమారుడు సూర్యరామ్ చూసి మరో నందమూరి వారసుడు బాలయ్యకు పోటీగా వచ్చేలా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ కుమారుడు సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఖచ్చితంగా మరో ఐదేళ్లలోపు ఉంటుందనే విధంగా టాక్ వినిపిస్తోంది. గత ఏడాది డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిర్మాతగా భారీ సక్సెస్ అందుకుంటున్న కళ్యాణ్ రామ్ ఎక్కువగా తన తమ్ముడి సినిమాలనే నిర్మిస్తూ ఉన్నారు. ఇటీవల దేవర సినిమాతో కూడా ఒక సంచలనం సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: