మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు. వాటి అనుగుణంగానే సినిమా రీలిజ్‌ను కూడా చేస్తూ ఉంటారు. అలాంటిది రాజమౌళి సెంటిమెంట్ అనేది కూడా ఒకటి టాలీవుడ్ లో అన‌వాతిగా వస్తూ ఉంది. ఇప్ప‌టివరకు రాజమౌళి తెర్కెక్కించిన  సినిమాలు అన్నీ హిట్ అయితే.. ఆయనతో చేసిన తర్వాత ఆ హీరోల తర్వాతి సినిమాలు డిజాస్టర్లు అవుతూ వచ్చాయి.  రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1న్ నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్, రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేశాడు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవ‌ర‌ సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్, రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడని అభిమానులు అంటున్నారు.


అయితే ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1న్ తర్వాత సుబ్బు, సింహాద్రి తర్వాత ఆంధ్ర వాలా, ప్రభాస్ కి చత్రపతి తర్వాత పౌర్ణమి, బాహుబలి తర్వాత సాహో, రాదేశామ్‌, రామ్ చరణ్ కు మగధీర తర్వాత ఆరెంజ్ ఇలా వరుస డిజాస్టర్లు ఎదురయ్యాయి. వీరంతా రాజమౌళి సెంటిమెంట్ నుంచి త్వరగానే బయటకు వచ్చి మరో హిట్ అందుకున్నారు. కానీ ఒక్క స్టార్ హీరో కెరియర్ మాత్రం రాజమౌళి సెంటిమెంట్‌తో చిత్ర పరిశ్ర‌మ‌ నుంచే బయటికి వెళ్లిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ స్టార్ హీరోకి రాజమౌళి సినిమా తర్వాత 12 కు పైగా డిజాస్టర్లు వచ్చాయి. ఇంతకీ ఆ హీరో ఎవరనేది ఇక్కడ చూద్దాం. ఇంత‌కి ఆ హీరో మరెవరో కాదు యంగ్ హీరో నితిన్.. రాజమౌళి కాంబోలో 2004లో సై మూవీ వచ్చింది. రబ్బి గేమ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో యూత్ ను బాగా మెప్పించింది.


ఈ సినిమాతో నితిన్ సూపర్ హిట్ అందుకున్నాడు. సై తర్వాత నితిన్ కి దాదాపు 8 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఒక్క హిట్ కూడా రాలేదు. 8 సంవత్సరాలో 12 సినిమాలు చేస్తే ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. దీంతో ఒక దశలో నితిన్ కి చిత్ర పరిశ్రమపై విరక్తి వచ్చి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అని కూడా అనుకున్నాడట. చివరి ప్రయత్నంగా విక్రమ్ కుమార్ తో 2012లో ఇష్క్ మూవీ చేశాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో నితిన్ కెరీర్ మళ్ళీ చిగురించింది. ఇష్క్ తర్వాత నితిన్ మంచి విజయాలు వ‌చ్చాయి. ఆ విధంగా నితిన్ రాజమౌళి సెంటిమెంట్ ప్రభావానికి ఎక్కువగా గురయ్యాడు. ప్రస్తుతం నితిన్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు మూవీతో పాటు అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీలో నటిస్తున్నాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: