టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తన నటన, అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచాడు. ఈ మధ్యకాలంలో తాను నటించిన గుంటూరు కారం సినిమాకి నెగిటివ్ రివ్యూ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిందంటే దానికి గల కారణం మహేష్ బాబు నటన అనే చెప్పవచ్చు. ఈ ఏడాది సంక్రాంతి మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దీంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే మొదటి షో నుంచి ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అంతేకాకుండా అదే రోజు హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవడంతో ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆ సినిమా కలెక్షన్లు భారీగా పెరిగిపోయాయి. గుంటూరు కారం సినిమాకు కాస్త కలెక్షన్లు తగ్గాయి. ఇదిలా ఉండగా....మహేష్ బాబుకు ఇండస్ట్రీలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అతని సినిమా వచ్చిందంటే చాలు ఎంతో సంబరపడిపోయి చూస్తూ ఉంటారు.


మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ కూడా అవకాశాన్ని అస్సలే వదులుకోదు. ఆ అవకాశాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తుంటుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అమృత చౌదరి మహేష్ బాబుపై కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. మహేష్ బాబుతో ఛాన్స్ వచ్చినా నేను సినిమా చేయను అంటూ బాంబు పేల్చింది. అంత పెద్ద స్టార్ హీరోతో నటించడం నాకు చాలా భయం అని తెలిపింది. నేను మరికొన్ని సినిమాలు చేసి యాక్టింగ్ లో పర్ఫెక్ట్ అయిన తర్వాతే మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ వస్తే చేస్తానని చెప్పింది హీరోయిన్ అమృత చౌదరి.


కాగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన ఊర మాస్ మూవీ స్కంద. అయితే స్కంద సినిమాలో హీరో రామ్ కి చెల్లెలుగా నటించిన అమ్మాయి ఎవరో కాదు అమృత చౌదరి. ఈ అమ్మాయి భీమవరంకి చెందింది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పటినుంచి పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అమృత చౌదరి మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాలలో అవకాశాలను అందుకుంది. అంతేకాకుండా పలు కవర్ సాంగ్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా స్కంద సినిమాలో అవకాశం రావడంతో రామ్ కి చెల్లెలుగా నటించింది.





మరింత సమాచారం తెలుసుకోండి: