ఇదిలావుండగా దేవర' ప్రదర్శిస్తున్న థియేటర్లలో 'ఆయుధ పూజ' పాట వచ్చినప్పుడు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు స్టెప్పులు వేయడం మొదలు పెడుతున్నారు. పరవశంతో పులకించిపోతున్నారు.ఇదిలావుండగా ఈ మాస్ పాట లో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోయిందని, గ్రేస్ మామూలుగా లేదని ప్రశంసిస్తున్నారు. చాలా మంది ఈ పాటకు స్టెప్పులేస్తూ రీల్స్ కూడా చేస్తున్నారు. అమ్మాయిలు సైతం ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఇదే పాట వినిపిస్తుంది.ఇదిలావుండగా ఆయుధ పూజ' పాటలో ఎన్టీఆర్ వేసిన ఒక స్టెప్ ఆయన తాతయ్య, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మార్క్ మేనరిజాన్ని గుర్తు చేసిందని కొందరు అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించినప్పుడు తాత గారిని ఇమిటేట్ చేయాలని తాను అనుకోలేదని అలా ఫ్లోలో వచ్చేసిందని తెలిపారు. గణేష్ ఆచార్య మాస్టర్ ఎప్పటి నుంచో నాతో ఒక సాంగ్ చేయాలని అనుకుంటున్నారని, ఈ పాటతో కుదిరిందని ఆయన చెప్పారు.
''ఆయుధ పూజ పాటను మేం చివరిగా షూటింగ్ చేశాం. అప్పుడు సంగీత దర్శకుడు అనిరుద్ చాలా బిజీ. అమెరికాలో కాన్సర్ట్స్, టూర్స్ అంటూ తిరుగుతున్నాడు. ఆ సాంగ్ షూటింగ్ చేయడానికి మూడు రోజుల ముందు ట్యూన్ ఇచ్చాడు. ఒక్క రోజులో రామ జోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ రాశారు. నిజంగా ఆయనకు దండం పెట్టాలి. 'దేవర' కథతో ముందునుంచే ట్రావెల్ అవుతూ ఉండడం వల్ల ఆ క్యారెక్టర్ ఆయన నరాలలో జీర్ణించుకో పోయింది. ఆయన్ను సరస్వతీపుత్ర అంటారు కదా. ఆ రోజు నిజంగా అదే అనిపించింది'' అని ఎన్టీఆర్ తెలిపారు.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో వార్ 2, ఎన్టీఆర్ నీల్ సినిమా, దేవర 2. దేవర 2 కి ఇంకా సమయం ఉందనే విషయం అర్ధమైంది. పుష్ప మాదిరిగా సమయాన్ని వృధా చేయకుండా ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. వార్ 2 సినిమా విషయంలో పక్కాగా ఉన్నాడు తారక్.