ఈ ఇంటర్వ్యూలో ‘దేవర’ మూవీలో వర్క్ చేయడం చాలా గొప్పగా అనిపించిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అయితే పార్ట్ 2 గురించి ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకోవాలని యాంకర్ సుమ అడిగింది. అంతేకాదు ‘దేవర 1’ చూసిన ఆడియన్స్ కి వచ్చిన డౌట్స్ క్లారిఫై చేయాలంటూ కోరింది. ఆ సందేహాలకు ఎన్టీఆర్ విచిత్రంగా సమాధానాలు చెప్పి మతి పోగొట్టాడు. "అసలు దేవరని వర ఎందుకు చంపాడు?" అని సుమ క్వశ్చన్ చేస్తే... "హా, చెప్పేస్తారు మరి… ఆ సీక్రెట్ చెప్పేస్తే ఇక ‘దేవర 2’ మూవీ టికెట్లు కొంటారు?" అంటూ ఎన్టీఆర్ అని రిప్లై ఇచ్చాడు. అంటే ఆ ట్విస్ట్ ఒక్కటే ఈ సినిమా మొత్తం లో హైలైట్ ఆ మిగతా భాగం అంతా చూసేంత గొప్పగా ఉండదా అని కొంతమంది సరదాగా ప్రశ్నిస్తున్నారు.
నిజానికి సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్ అనేది ఉంటుంది. దాన్ని ఎవరూ రివీల్ చేయరు. ఇక్కడ తారక్ కూడా అదే పని చేశాడు. కాకపోతే సినిమా టికెట్లు ఎవరు కొంటారు అన్నట్లుగా ఆయన రిప్లై ఇవ్వడమే చర్చనీయాంశం అయ్యింది. ఆయన దీని గురించి ఏమీ మాట్లాడకుండా ఉంటే బాగుండేదని, అనవసరంగా దాని గురించి పెదవి విప్పి తప్పు చేశారని మరి కొంతమంది అంటున్నారు.
సుమ సముద్రంలోని స్కెలిటెన్స్ గురించి ప్రశ్నించగా, ఎన్టీఆర్ అవన్నీ కూడా ఈత కొట్టి వెళ్లిపోయాయని ఒక జోక్ పేల్చాడు. అయితే, కొరటాల శివ సముద్రంలోని ఒక అస్తిపంజరంలో ఓ ముఖ్యమైన పాత్ర ఉంటుందని భారీ క్లూ ఇచ్చాడు. ఆ పాత్ర ఎవరో తెలుసుకోవాలంటే దేవర పార్ట్ 2 చూడక తప్పదు అని పేర్కొన్నాడు. వారి మాటలను బట్టి చూస్తుంటే దేవర సినిమా ప్రారంభంలో చూపించిన అస్తిపంజరాలతో ఉత్కంఠభరితమైన యుద్ధం ఉంటుందని స్పష్టమవుతుంది. జాన్వీ కపూర్ పాత్ర దేవర పార్ట్ 1లో తక్కువ సేపు ఉంది, కానీ పార్ట్ 2లో వర, తంగం మధ్య ఆమె ఒక లవ్ స్టోరీ నడుపునట్టుగా సమాచారం. ఆమె పాత్రకు రెండవ భాగంలో మరింత ప్రాముఖ్యత ఉండొచ్చు.
ఎన్టీఆర్ తంగం పాత్ర దేవర పార్ట్ 2 లో కీలకమైనది అని చెప్పారు, ఇది జాన్వి కపూర్ ను సినిమాలో ఎక్కువగా చూడాలని ఆశపడిన అభిమానులను ఉత్సాహపరిచింది. అతను పార్ట్ 2 లో ప్రతి ఒక్కరి మనసును తాకే భావోద్వేగ దృశ్యం ఉంటుందని కూడా పంచుకున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరూ రెండవ భాగంలో అనేక మంచి అంశాలు ఉంటాయని చెప్పారు.