తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ, సమంత, అక్కినేని కుటుంబ విషయం ఎంత రచ్చ రచ్చగా మారిందో చూసాం. ఈ క్రమంలోనే సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు టాలీవుడ్ మొత్తం మ‌ద్ధతుగా నిలబడింది. ఇది సహజంగానే కొందరికి నచ్చినట్టులేదు. కొండా సురేఖ ఇటీవల నాగచైతన్య, సమంత విడిపోవడానికి నాగార్జున కారణమంటూ తీవ్ర అభ్యంతర కామెంట్ చేశారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే నాగర్జున కుటుంబం పై కామెంట్ చేసిన సురేఖ.. నాగార్జున కుటుంబానికి మాత్రం క్షమాపణలు చెప్పలేదు.


దీంతో ఇండస్ట్రీ అంతా సురేఖ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. ముక్త‌కంఠంతో ఖండించింది. నాగార్జున కోసం సినిమా పరిశ్రమ అంతా ఏకంకావడం.. అందులోనూ సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న కూడా ఇండస్ట్రీ హీరోలు అందరూ రెచ్చిపోయి కామెంట్లు చేయడం.. తెలంగాణ ప్రభుత్వానికి ఎంత మాత్రం నచ్చలేదని తెలుస్తోంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని చెప్పినా కూడా సినిమా వాళ్ళు రెచ్చిపోయి మరి కామెంట్లు చేశారు. దీంతో ఇండస్ట్రీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇది ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కావచ్చు.. ఇటు కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా రుచించడం లేదు.


చంద్రబాబు సతీమణి భువనేశ్వరీపై, అలాగే పవన్ కళ్యాణ్ తల్లిపై గతంలో కొందరు అభ్యంతరకర కామెంట్లు చేసినప్పుడు.. సినీ పరిశ్రమ ఇలా ఏకతాటి మీదకు ఎందుకు రాలేదు.. ఎందుకు నిలదీయలేదని.. వాపోతున్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరిపై టాలీవుడ్ నిర్మాతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ అభ్యంతరకర కామెంట్లు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పై శ్రీరెడ్డితో పాటు కొందరు తీవ్ర విమర్శలు చేసిన ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీదకు రాలేదు. ఏది ఏమైనా ఇప్పుడు నాగార్జున మద్దతుగా టాలీవుడ్ అంతా నిలబడటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దలకు పెద్దగా రుచించడం లేదన్న చర్చలు నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: