సూపర్ స్టార్ రజినీకాంత్‌ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే .. మూడు రోజుల చికిత్స అనంతరం గత శుక్రవారం హాస్పటల్ నుంచి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన వెట్టైయాన్ మూవీ విడుదలకు రెడీగా ఉంది . ఇక ఈ సినిమా ను జై భీమ్ వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించాడు . దసరా కానుకగా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకు లను ఆకట్టుకున్నాయి .


 జైలర్ లాంటి బిగ్గెస్ట్ హిట్‌ తర్వాత రజిని సోలో హీరోగా వస్తున్న సినిమా కావటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇక ఈ సినిమాలో రజనీతో పాటు అమితాబచ్చన్ , రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, మంజి వారియర్ వంటి వారు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు . అయితే రజినీకాంత్సినిమా కోసం రూ. 125 కోట్లకు పైగా రెమ్యూనిరేషన్ అందుకున్నారట. ఇక అమితాబ్ బచ్చన్  కూడా రూ. 7 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారట. అలాగే ఫహద్ ఫాజీల్ రూ. 3కోట్లు,  మంజూ వారియ‌ర్ రూ. 85 లక్షలు చొప్పున రెమ్యూనిరేషన్ అందుకున్నారట.


ఇక వీరితో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రితిక సింగ్ కూడా రూ. 25 లక్షలు అందుకున్నారట. జైలర్ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మించిగా ఆ సినిమాకు రజనీకాంత్ రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇక ఇప్పుడు వెట్టైయాన్ ను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇక ఈ మూవీలో రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా నేరస్తులకు సింహ స్వప్నంగా ఉండే వ్యక్తికి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చేయి అనేది సినిమా కదా.. ఇక ఈ సినిమాతో రజినీకాంత్ జైలర్ లాంటి మరో హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: