పైన ఫోటోలో బిడ్డను చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ఈమె టాలీవుడ్ లోనే ఎంతో ఫేమస్ తన చలాకీ మాటలతో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఓ మెయిల్ యాంకర్ తో కలిసి ఆమె చేసిన టీవీ ప్రోగ్రాములు అప్పట్లో బుల్లితెర‌ ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి. అలాగే ఈమె బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 4లో కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెట్టి ఉన్నన్ని రోజులు తన ఆటపాటలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద కనిపించడం లేదు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్గా ఉంటుంది.


అలాగే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తుంది. తన కుటుంబంతో కలిసి వీడియోలు చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ యాంకరమ్మ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.  అందులో ఆమె బిడ్డను చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తూ కనిపించింది.  వాటిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ స్టార్ యాంకర్ కు ఏమైందనే కామెంట్లు పెడుతున్నారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరో గుర్తుపట్టార? ఆ యాంకర్ మరెవరో కాదు ఏనుగు చేమా జోకులతో ప్రేక్షకులను నవ్వించిన లాస్య. అసలు ఆ ఫోటోలు ఎందుకు పెట్టింది అసలు స్టోరీ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవి నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.


అలాగే ఈ తొమ్మిది రోజులు అమ్మవారి రూపానికి తగినట్లుగా తొమ్మిది రంగుల దుస్తులను ధరించి భ‌క్తులు, దుర్గమ్మను ఎంతో భక్తిగా పూజిస్తారు. ఈ క్రమంలోని యాంకర్ లాస్య తన ఇంటి దగ్గర కూడా నవరాత్రి ఉత్సవాలను జరిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ బట్టలను ధరిస్తూ వాటి వెనక ఉన్న క‌థ‌ల‌ను  తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక ఈ నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పసుపు రంగు చీరను ధరించింది.. అది శైలపుత్రి రూపం అంటూ పసుపు రంగు ప్రాముఖ్యతను చెప్పుకొచ్చింది ఇక రెండో రోజు బ్రహ్మచారిరోజు బ్రహ్మచారిని దేవీ రూపం అంటూ ఆకుపచ్చ రంగు చరణ్ ధరించింది. ఇక మూడోరోజున చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారట. అందులో భాగంగానే బూడిద రంగు దుస్తులు ధరించింది లాస్య. ఇది మహిళా శక్తికి ప్రతిరూపమని క్యాప్షన్ లో చెప్పుకొచ్చింది. ఇలా మిగిలిన ఆరు రోజులకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో లాస్య పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: