సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న నటి కూడా చెప్పే మాట. అయితే కొంతమంది ఏదో మీది మీదకి క్యాస్టింగ్ కౌచ్ లేదని చెప్పినప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చెబుతారు. ఇక స్టార్ హీరోయిన్ అయినటువంటి రమ్యకృష్ణ కూడా స్టార్ అవ్వాలంటే కచ్చితంగా వాళ్ల పడక గదిల్లోకి వెళ్లాల్సిందే అని ఓ సినిమా ఈవెంట్లో చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి ఏ డైరెక్టర్ తో క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యింది అనేది బయట పెట్టలేదు. కానీ ఓ డైరెక్టర్ చేసిన పనికి రమ్యకృష్ణ షూటింగ్స్ సెట్ నుండి కన్నీళ్లు పెట్టుకొని ఇంటికి వెళ్లి పోయిందట. 10 వేలు చేతిలో పెట్టి అది పట్టుకోమని డైరెక్టర్ అనడంతో ఏం చేయాలో అర్థం కాని రమ్యకృష్ణ కన్నీళ్లు పెట్టుకొని ఇంటికి చేరుకుందట. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు రమ్యకృష్ణను ఏం చేయమన్నారు.ఆమె కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంది అనేది చూస్తే.. రమ్యకృష్ణ చేతిలో 10 వేలు పెట్టింది ఎవరో కాదు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్. వి.కృష్ణారెడ్డి.. 

అవును మీరు వినేది నిజమే..కానీ ఈ విషయాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటే పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే వీరిద్దరి మధ్య జరిగింది మీరు అనుకుంటున్నట్లు ఏదో తప్పు కాదు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఆహ్వానం సినిమాలో శ్రీకాంత్ హీరోగా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నాక లాస్ట్ సీన్ తెరకెక్కించి ఇవాల్టితో షూటింగ్ ముగిసిపోతుంది అనుకున్న సమయంలో రమ్యకృష్ణ కి ఓ షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారట ఎస్వి కృష్ణారెడ్డి. అదేంటంటే..

రమ్యకృష్ణ ఇంటికి వెళ్లే సమయంలో ఆమెను పిలిచి మరీ ఒక ప్లేట్లో చీర, పూలు, గాజులు, పసుపు కుంకుమతో పాటు పదివేలు పెట్టి ఒక ఆడపడుచుకు పుట్టింటికి వచ్చిన అమ్మాయికి ఎలా అయితే వాయినం పెట్టి పంపుతారో అదేవిధంగా ఎస్వీ కృష్ణారెడ్డి ఆయన భార్య రమ్యకృష్ణ చేతిలో పెట్టారట. ఇక వాళ్ళు చేసిన మర్యాదలకు ఫిదా అయిపోయిన రమ్యకృష్ణ ఏం చేయాలో తెలియక ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుందట. అలా వాళ్ళు పెట్టిన ఆ చీరే సారెను ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో వాళ్లకు కూడా ఈ విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుందట..ఇప్పటివరకు నేను ఎంతో మంది దర్శకులతో పనిచేశాను కానీ ఇలా ఎవరు చేయలేదు అని ఎమోషనల్ అయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: