కొండా సురేఖ - సమంత - అక్కినేని నాగార్జున విషయం ముదిరి పాకాన పడుతోం.ది ఇక సురేఖ విషయంలో ఎవరు మాట్లాడిన ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నుంచి టాలీవుడ్‌కు నేరుగా హెచ్చరిక వచ్చేసింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని.. సురేఖ తన మాటలు వెనక్కు తీసుకున్నారని.. చెప్పిన ఇండస్ట్రీ వాళ్ళు ఆగటం లేదు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి కొండా సురేఖపై ఇక ఒక్క మాట మాట్లాడిన ఆమె ఒంటరి కాదని సంగతి గుర్తుంచుకోవాలని వారిని హెచ్చరించారు. అది సలహా కాదు.. ప్రభుత్వం తరఫున పరోక్షంగా వచ్చిన హెచ్చరిక. ఆమె తన మాటలు ఉపసంహరించుకుంటున్నా అని చెప్పిన తర్వాత కూడా టాలీవుడ్ అతిగా స్పందిస్తున్న అభిప్రాయంతో కాంగ్రెస్ ఉంది.


అందుకే వారి తోకలు కత్తిరించాలని నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ నేతల మాయ‌లో ఉన్న టాలీవుడ్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని.. అలాంటి వాటిని సహించే ప్రశ్నలేదని పొన్నం మాటల ద్వారా స్పష్టం అవుతుంది. మహేష్ గౌడ్ చాలా వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. కానీ అదే అలుసైపోయినట్టుగా ఉంది. ఇంకా కూడా కొంతమంది సినిమా వాళ్ళు రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే నాగర్జున పై కబ్జా కేసు కూడా నమోదు అయింది. ఆ కేసులో డబ్బులు వసూలు చేయాలని పిటిష‌న‌ర్  పేర్కొన్నారు. ఇంతకాలం ఎన్ క‌న్వెన్షన్ మీద సంపాదించినది అంతా వసూలు చేయాలని ఫిర్యాదు చేసిన వ్యక్తి కోరుతున్నారు.


ఈ కేసు నాగార్జునకు, టాలీవుడ్‌కు హెచ్చరిక లాంటిది. ఈ కేసు నమోదు అయిన తర్వాత పొన్నం ప్రెస్ మీట్ పెట్టి కామెంట్లు చేశారు. ఇప్పటికైనా టాలీవుడ్ వాళ్ళు ప్రోత్సాహం అర్థం చేసుకునే సైలెంట్ గా ఉంటారా.. లేకపోతే వెండి తెర మీద హీరోయిజం చూపించాలని ఇక్కడ కూడా రెచ్చిపోతారా.. అన్నది రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా కొండా సురేఖ విషయంలో టాలీవుడ్ అతి చేస్తుందని.. నాగార్జున విషయంలో ప్రభుత్వ పెద్దలకు స్పష్టత ఉందని తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి కూడా టాలీవుడ్ తోక కత్తిరించే విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకూడదు అన్న నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: