తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని స్టార్‌డంతో దూసుకుపోతున్నాడు. ఆయన ఒక స్టోరీని సెలెక్ట్ చేశాడు అంటే కథలో ఎన్నో ఊహించని వైవిద్యమైన సంగతులు ఉంటాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చిరంజీవి మొదటిలో తన సినిమాల కథల విషయంలోనే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం కూడా కథలను సెలెక్ట్ చేసి సినిమాలు తీయించేవాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ చేసిన ఒక సినిమా విషయంలో చిరంజీవి వద్దని చెప్పినా కూడా పవన్ వినకుండా ఆ సినిమాను చేశాడు. చివరకు ఆ సినిమా ఫలితం ఏమైంది అనే విషయం పక్కన పెడితే కథల విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ చాలా కరెక్ట్ గా ఉంటుంది.


అయినా ఒక సినిమా చేస్తున్నాడు అంటే కచ్చితంగా హిట్ అవుద్దనే చెప్పాలి. ఎక్కడో ఒకచోట చిన్న లోపం జరిగితే తప్ప ఆ సినిమా ప్లాఫ్ అవదు అని అంటారు.  అందు కారణంగానే ఆయన గతంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సాధించి మెగాస్టార్‌గా ఎదిగారు. అలాగే కథల విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి అలాంటి సమయంలో పవన్ చేసిన గుడుంబా శంకర్ సినిమా క‌థ‌ను ముందుగా చిరంజీవి విన్నాడట.


ఆ స్టోరీ చిరంజీవికి పెద్దగా  నచ్చకపోవడంతో ఆ సినిమాను వదిలేయమని పవన్ కళ్యాణ్ కు చెప్పాడట. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దర్శకుడు వీరశంకర్ కి సినిమా చేస్తానని మాట ఇచ్చాడు కాబట్టి తన మాటను వెనక్కి తీసుకోలేక ఆ సినిమాను చేశాడు. చివరకు ఆ సినిమా చిరంజీవి చెప్పినట్టే ప్లాప్ గా మిగిలిపోయింది. అలా ఆ సినిమా దగ్గర్నుంచి పవన్ కళ్యాణ్ వరుసగా అప‌జ‌య‌ల‌ని ఎదుర్కొన్నాడు . మళ్లీ ఎప్పుడైతే గబ్బర్ సింగ్ సినిమా వచ్చిందో అప్పుడు మంచి సక్సెస్ సాధించి.. ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశాడు . ఇలా అన్న చిరంజీవి జడ్జ్మెంట్లో చాలా వరకు నిజాయితీ ఉంటుందని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: