టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొర‌టాల‌ శివ ప్రస్తుతం దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. ఇప్పటికే రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే ఇప్పుడు కొరటాల తర్వాత సినిమా ఏంటనేది .. ఎవరితో చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో ఆచార్య తర్వాత దేవరతో హిట్‌ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు కొరటాల. అలాగే దేవర 2 కూడా చేయాల్సి ఉన్న.. అందుకు కాస్త టైం తీసుకోవాలని భావిస్తున్నాడు.


అయితే ఇప్పుడు కొరటాల తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. దానికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన కూడా రాలేదు. ప్రధానంగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , ప్రభాస్ , రామ్‌చరణ్ , మహేష్ బాబు.. తమ తర్వాత  ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో మహేష్ బాబుతో కొరటాల ఇప్పుడు మరోసారి సినిమా చేయవచ్చని వార్త వైరల్ గా మారింది.  అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసం తన మేకోవర్ని కూడా పూర్తిగా మార్చుకుంటున్నాడు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కొద్ది రోజులుగా అనేక సార్లు కెమెరాకు మహేష్ చిక్కారు.


ఈ సినిమాలో ఆయన లుక్ ఆ విధంగానే ఉండబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలో SSMB 29 మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. దీంతో కొన్ని రోజుల పాటు మహేష్ బాబు ఖాళీగా ఉన్నట్లే! అందుకే ఆ గ్యాప్ లో మహేష్ తో కొరటాల సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. కానీ అది జరిగే అవకాశం అస్సలు లేదు. మహేష్ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు.. రాజమౌళి అసలు ఒప్పుకోరు! కాబట్టి ఇప్పట్లో కొరటాల, మహేష్  సినిమా రావ‌డం దాదాపు అసాధ్యమే. అయితే ఇప్పటికే కొరటాల డైరెక్షన్ లో మహేష్ బాబు భరత్ అనే నేను, శ్రీమంతుడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: